5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే..
న్యూఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. పోలింగ్‌కు మూడు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకొక్క రోజే గడువు. 28వ తేదీ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. ఒకే విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఎన్నికల ప్రచారానికి ఇక చివరి రెండు రోజులే మిగిలివున్న నేపథ్యంలో- రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు, రోడ్ షోలు హోరెత్తిపోనున్నాయి. ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు.

తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో డిసెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది. ఈ నెల 7వ తేదీన మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత, 17న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండో విడత పోలింగ్ పూర్తయింది. 23వ తేదీన రాజస్థాన్‌లో ఎన్నికలు ముగిశాయి.
డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడిన మరుసటి రోజే.. పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కానున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇవి- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. రాజ్యసభ, లోక్‌సభలను సమావేశ పరుస్తూ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సమావేశాలు ఎలా సాగుతాయనేది ఆసక్తి రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న నేపథ్యంలో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం దీనిపై ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
దీనికి ముందు- డిసెంబర్ 2వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది అధికార పార్టీ. అన్ని పార్టీల ప్రతినిధులు దీనికి హాజరవుతారు. ఉభయ సభల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అజెండా, సభా కార్యకలాపాల నిర్వహణ, బిజినెస్ షెడ్యూల్‌ను నిర్ధారిస్తారు. పార్లమెంటరీ పార్టీల అధినేతలు దీనికి హాజరవుతారు.












Click it and Unblock the Notifications