Forgery Case: మృతదేహం బొటన వేలితో సంతకం.. వైరల్ అయిన వీడియో..
ప్రస్తుతం మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం చాలా మంది డబ్బు చుట్టే తిరుగుతున్నారు. ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఆస్తికోసం చనిపోయిన మహిళ బొటనవేలిముద్రను ఆమె బంధువులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన ఘటన యూపీలో జరిగింది. కారులో వెనుక భాగంలో మహిళ డెడ్ బాడీ ఉంది.
ఆమె బంధువులు నకిలీ వీలునామాపై రెండు సార్లు బొటనవేలి ముద్రను తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రాలోని సెవ్లా జాట్ ప్రాంతంలో నివాసముంటున్న కమలాదేవి అనే మహిళ 2021, మే8వ తేదీన కన్నుమూసింది.

అయితే అంతకు ముందే ఆమె భర్త చనిపోయాడు. వారికి పిల్లలు లేరు. కమలాదేవి చనిపోయిన తర్వాత ఆమె బావ కొడుకులు మృతదేహాన్ని ఆగ్రా ఆస్పత్రికి తరలించే క్రమంలో కారును ఆపారు. నకిలీ వీలునామాపై కమలాదేవి బొటనవేలు ముద్ర వేయడానికి ఒక న్యాయవాదిని పిలిపించారు.
వీలునామాను ఇల్లు, దుకాణం సహా ఆస్తులను బావ కొడుకులకు కమలాదేవి రాసిఇస్తున్నట్లు తయారు చేశారు. అయితే కమలా దేవి బొటన వేలి ముద్రను కాకుండా సంతకం చేస్తుంది. దీనిపై అనుమానం వచ్చిన సంబంధికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Thumb impression of a dead woman taken forcibly on legal papers by a known family in Agra. Looks like it's an advocate getting it done. Act caught on camera!
— Judge Sahab❣️ (@lawWalaLadka) April 11, 2023
Video via @sudhirkmr6931 pic.twitter.com/UdBqcMBf1l
ఇంతలో కమలాదేవి బొటన వేలిముద్రను ఆమె బావకొడుకులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కారు వెనుకసీట్లో ఉన్న కమలాదేవి మృతదేహం పడింది. ఈ సమయంలో ఓ న్యాయవాది స్టాంప్ ప్యాడ్ పై కమలాదేవి బొటన వేలి ముద్రను వేస్తున్నాడు. 45 సెకన్ల వీడియోలో కనిపించడంతో ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారడంపై ఆగ్రాలోని స్థానికులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications