అసలు కథ మొదలైయ్యింది, ఢిల్లీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, ఆశీర్వాదం కాదు !
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆరు నెలల తర్వాత బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ నేత బీవై విజయేంద్రను ఎన్నుకోవడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో సీనియర్ అనే పదం కంటే కుల రాజకీయాలు ఎక్కువ కావడంతో బీజేపీ హైకమాండ్ కు పెద్ద తలనొప్పి అయ్యింది.
కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ బసవనగౌడ పాటిల్ యత్నాల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆర్ అశోక్, అశ్వత్ నారాయణ, బీజేపీ సీనియర్ నాయకుడు సునీల్ కుమార్ వంటి చాలా మంది నాయకులు రేసులో ఉన్నారు. ప్రతిపక్ష స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో అర్థం కాకపోవడంతో బీజేపీ హైకమాండ్ కు పెద్ద తలనొప్పి తయారైయ్యింది.

విధాన పరిషత్ సభ్యుడు కోట శ్రీనివాస పూజారి ఎగువ సభ ప్రతిపక్షనేత పదవిని డిమాండ్ చేశారు. గతసారి ప్రతిపక్ష నేతగా పార్టీ నాకు అవకాశం ఇచ్చిందని కోటా శ్రీనివాస పూజారి అన్నారు. విధానపరిషత్ సభ్యుడు కోట శ్రీనివాస పూజారి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా తనకు అవకాశం ఇస్తే శక్తివంచన లేకుండా తాను పని చేస్తానని చెప్పారు.
బీజేపీకి 34 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇలాంటి పోస్టుల పదవి కోసం చాలా మంది ఆశపడుతారని, కాబట్టి ఎవరిని ఎంపిక చేయాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు కోట శ్రీనివాస్ పూజారి అన్నారు. విధాన పరిషత్ ప్రతిపక్ష నేత స్థానాన్ని బహిరంగంగా మాజీ మంత్రి కోటా శ్రీనివాస్ పూజారి డిమాండ్ చేశారు. అయితే అసెంబ్లీలోనే ప్రతిపక్ష నాయకుడికి దిక్కులేదని, ఇక విధాన పరిషత్ లో నాయకుడి కోసం ఇదేమి కొత్త డిమాండ్ అని బీజేపీ నాయకులు అంటున్నారు.
కర్ణాటకలోని బీజేపీ నాయకుల మధ్య తేడాలు రావడం, ఢిల్లీలో చక్రం తిప్పడంతో ఆ పార్టీకి మొదటికే మోసం వచ్చింది. ధక్షిణ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఏకైక రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే సామెతలాగా ఇప్పుడు కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడిని నియమించడంలో బీజేపీ విఫలం అయ్యిందని కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.












Click it and Unblock the Notifications