ఐటీ హబ్ లో ట్యూషన్ కు వెళ్లిన బాలుడు మాయం, సీసీటీవీల్లో చివరి సారిగా రికార్డు అయ్యింది ?
పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని, వారు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి బిడ్డ తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు పస్తులు ఉండి పిల్లలకు కడుపునిండా భోజనం పెడుతున్నారు. మంచి స్కూల్లో పిల్లలు చదువుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచించే తల్లిదండ్రులు పగలు, రాత్రి కష్టపడి పిల్లలకు స్కూల్ ఫీజులు కడుతున్నారు.
స్కూల్, కాలేజ్ లో తమ పిల్లలకే మొదటి ర్యాంకులు రావాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. తల్లిదండ్రుల ఆశపడుతున్నట్లే చాలా మంది పిల్లలు కష్టపడి బాగా చదువుకుంటున్నారు. స్కూల్ తో పాటు ట్యూషన్లకు వెళ్లే పిల్లలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అయితే ఇంటి నుంచి ట్యూషన్ కు వెళ్లిన బాలుడు కనపడకుండా పోవడంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

బెంగళూరులోని విజయనగర్‌లో ట్యూషన్‌కు వెళ్లిన 12 ఏళ్ల బాలుడు అనుమానాస్పదంగా అదృశ్యమయ్యాడు.
పరిణవ్ (12) ట్యూషన్ నుండి బయటకు వచ్చిన తరువాత తప్పిపోయాడు. విజయనగరంలో నివాసం ఉంటున్న సుఖేష్, నివేదిత దంపతులకు పరిణయ్ అనే కుమారుడు ఉన్నాడు. బాలుడు గుంజూరులోని డెన్ అకాడమీ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. వైట్‌ఫీల్డ్‌లోని అలెన్ అనే ట్యూషన్ సెంటర్‌కు ఇతను వెళ్లేవాడు.
సోమవారం ఉదయం ఎప్పటిలాగే తండ్రి సుఖేష్ అతని కొడుకు పరిణయ్ ని అలెన్ ట్యూషన్ సెంటర్‌లో వదిలివెళ్లాడు. అయితే మధ్యాహ్నం మళ్లీ పికప్ చేసుకోవడంలో ఆలస్యం అయ్యింది. ఆ కొద్ద సమయంలోనే పరిణయ్ కనిపించకుండా పోయాడు. సోమవారం మధ్యాహ్నం 12. 15 గంటల ప్రాంతంలో అదృశ్యమైన పరిణయ్ ఇంతవరకు కనిపించలేదు.
ట్యూషన్ ముగించుకుని మారతహళ్లి వరకు నడిచి వెళ్లిన పరిణయ్ తరువాత బీఎంటీసీ బస్సు ఎక్కిన విషయం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఆ తర్వాత పరిణయ్ ఎక్కడా కనిపించలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు సిటీలోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అదృశ్యమైన బాలుడి కోసం వైట్‌ఫీల్డ్ పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications