shock: రోడ్డు పక్కన 8 గంటలు యువకుడి శవం, అర్దరాత్రి ఏం జరిగిందంటే, సీసీటీవీల్లో షాక్ !

లారీ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నపడంతో ఓ యువకుడి ప్రాణం పోయింది. యువకుడి శవం 8 గంటల పాటు రోడ్డు పక్కనే పడిఉండటం హాట్ టాపిక్ అయ్యింది. సీసీటీవీల్లో అసలు మ్యాటర్ రికార్డు అయ్యింది.

చెన్నై/కొచ్చి/కన్యాకుమారి: అరటి చెట్ల మొక్కలతో తమిళనాడు నుంచి కేరళకు వెళ్లిన లారీ అక్కడ అరటి చెట్లు మొత్తం అన్ లోడ్ చేసి తరువాత తమిళనాడుకు బయలుదేరింది. ఆ లారీ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నపడంతో ఓ యువకుడి ప్రాణం పోయింది. యువకుడి శవం 8 గంటల పాటు రోడ్డు పక్కనే పడిఉండటం హాట్ టాపిక్ అయ్యింది. సీసీటీవీల్లో అసలు మ్యాటర్ రికార్డు అయ్యింది.

కేరళ నుంచి తమిళనాడు వెలుతున్న లారీ శుక్రవారం అర్దరాత్రి కొట్టారకర పక్కనే సదానందపురం సమీపంలో లారీ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న రతీష్ అనే యువకుడి మీద లారీ దూసుకపోయింది. రతీష్ కు తీవ్రగాయాలు కావడంతో అక్కడే కొట్టుమిట్టాడాడు. లారీ కొంత దూరం వెళ్లిన తరువాత అనుమానాస్పద లారీ డ్రైవర్ తిరిగి వచ్చాడు.

The driver who ran over the young man with a lorry and killed him escaped in Kerala.

తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న రతీష్‌ను లారీ డ్రైవర్‌ చూసి రోడ్డు పక్కకు తోసేశాడు. అనంతరం లారీతో డ్రైవర్ అక్కడి నుంచి లారీతో సహ పరారయ్యాడు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ఆ ప్రాంత ప్రజలు రతీష్ మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి చెంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి సమయంలో సమీపంలోని దుకాణాలకు వచ్చిన లారీలను పరిశీలించారు.

సీసీటీవీ ఫుటేజీలను కేరళ పోలీసులు పరిశీలించారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తక్కలైకి చెందిన డ్రైవర్ కృష్ణకుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల సహాయంతో పుత్తూరు ప్రాంతంలో పొంచి ఉన్న లారీ డ్రైవర్ కృష్ణకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ మానవత్వం లేకుండా ప్రవర్తించడం వల్లే రతీష్‌ మృతి చెందాడని, ఆస్పత్రికి తరలించి ఉంటే అతని ప్రాణాలు ఉండేవని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కేరళ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+