పోలింగ్ కేంద్రాల్లో అవి బ్యాన్, నిక్కర్ లో పెట్టుకున్నా పట్టుకుంటారు బ్రదర్, తెలివి మీకే కాదు!
లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ఎంపీలు కావాలని, తరువాత మంత్రులు కావాలని అనేక మంది నాయకులు కలలు కంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది మరోసారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగడానికి సర్వం సిద్దం చేశారు. ఏప్రిల్ 26వ తేదీన పలు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నామని, ఈలోగా ఎన్నికల నియమాలను పాటించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలింగ్ బూత్‌లకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవద్దని ఎన్నికల సంఘం ఓటర్లను ఆదేశించింది. గత సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లలోని కొందరు అక్రమార్కులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి అక్కడ పోలింగ్ బూత్ లను ఫోటో క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనలాగే అదే పార్టీకి మీరు ఓటు వేయాలని కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.

ఇలాంటి వీడియోలు వైరల్ కాకుండా, ఈసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్లను నిషేధించారు. పోలింగ్ బూత్‌లోకి ఓటర్లు ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లకూడదని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైర్‌లెస్ పరికరాలను తీసుకెళ్లడం కూడా సాధ్యం కాదని ఎన్నికల అధికారులు సూచించారు. ఇక్క లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల అధికారులు నియమాలు కట్టుదిట్టం చేశారు.

పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి మాత్రమే మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఓటర్లు తమ వద్ద కొన్ని పత్రాలను ఉంచుకోవాలని, ఓటర్ ఐడీ కార్డు కాకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని వెళ్లి ఓటు వెయ్యాలని అధికారులు సూచించారు. మీ బ్యాలెట్‌లో వ్యత్యాసాలు, లేదా ఎలాంటి సమస్యలు ఉంటే మీకు ఈ పత్రాలు అవసరం కావచ్చు అని, అయితే ఈ పత్రాల యొక్క ఫోటో లేదా స్క్రీన్ షాట్ పోలింగ్ బూత్ లోపల ఉంచరాదని ఎన్నికల అధికారులు సూచించారు. మొత్తం మీద పోలింగ్ కేంద్రాల్లోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తులు తీసుకెళ్లడాన్ని ఎన్నికల అధికారులు నిషేధించారు.












Click it and Unblock the Notifications