ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు: పక్కా ప్లాన్, చెన్నై పోలీసు కమిషనర్ పై వేటు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చెన్నై నగరంలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా నగర పోలీసు కమిషనర్ ఎస్. జార్జ్ మీద మరో సారి బదిలీ వేటు పండింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి.

చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జ్ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని, ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఆయన్ను బదిలీ చెయ్యాలని డీఎంకే పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

The Election Commission of India (ECI) on Saturday ordered transfer of Chennai city police commissioner S George.

ఆర్ కే నగర ఉప ఎన్నికల సందర్బంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులు అరాచకాలు చేసే అవకాశం ఉందని డీఎంకే పార్టీ ఆరోపించింది. అన్నాడీఎంకే పార్టీకి చెన్నై నగర పోలీసు కమిషనర్ సహకరిస్తున్నారని డీఎంకే పార్టీ ఆరోపించింది.

చెన్నై నగర పోలీసు కమిషనర్ ను వెంటనే వేరే ప్రాంతానికి బదిలీ చెయ్యాలని డీఎంకే పార్టీ ఎన్నికల కమిషన్ కు మనవి చేసింది. శనివారం జార్జ్ ను జైళ్ల శాఖకు బదిలీ చేశారు. జైళ్ల శాఖ అదనపు డీజీపీ త్రిపాఠిని చెన్నై నగర పోలీసు కమిషనర్ గా నియమించారు.

గతంలో నెల రోజుల పాటు త్రిపాఠి చెన్నై నగర పోలీసు కమిషనర్ గా పని చేశారు. తరువాత త్రిపాఠిని బదిలీ చేసి జార్జ్ ను మళ్లీ చెన్నై నగర పోలీసు కమిషనర్ గా నియమించారు. ఎలాగైనా డీఎంకే పార్టీ చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జ్ ను బదిలీ చేయించాలని అనుకున్నది సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Election Commission of India (ECI) on Saturday ordered transfer of Chennai city police commissioner S George. The DMK ahead of the R K Nagar bypoll, requested the Election Commission to transfer the Chennai Police Commissioner.
Please Wait while comments are loading...