కరోనావైరస్ సెకండ్ వేవ్‌కి పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్‌దే: మద్రాస్ హైకోర్టు ఆగ్రహం - Newsreel
దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడానికి ఎలక్షన్ కమిషనే కారణమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.
ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.

దేశంలో కరోనావైరస్ రెండో వేవ్ మొదలైనప్పటికీ రాజకీయ పార్టీల సభలకు అనుమతులు ఇవ్వడంపై కోర్టు ఆగ్రహించింది.
ఓట్ల లెక్కింపు సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా కోర్టు ఆదేశాలు జారీచేయాలంటూ ఓ ప్రజాప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/ANI/status/1386609810368462850
ఎన్నికల ప్రచార సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడడంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది.
''ప్రచారం జరుగుతున్న సమయంలో ఎన్నికల అధికారులు ఏమైనా ఇతర గ్రహాలలో ఉన్నారా?'' అంటూ న్యాయమూర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు.
ప్రజారోగ్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని రాజ్యాంగ సంస్థలు గుర్తుంచుకోవాలని.. కనీసం లెక్కింపు సందర్భంగానైనా కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించేలా ప్రణాళికలు వేయకపోతే కౌంటింగ్ నిలిపివేయిస్తామని కోర్టు హెచ్చరించింది.
మే 2న కౌంటింగ్ సందర్భంగా తీసుకోబోయే కోవిడ్ జాగ్రత్త చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించి ఏప్రిల్ 30న కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications