బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

engineer: సార్ కారులో రూ. 10 లక్షలు, ఏకంగా విధాన సౌధలోకి ఎంట్రీ, మ్యాటర్ అడిగితే ?, ఉద్యోగం ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మండ్య: రాష్ట్రానికి అధికార శక్తి కేంద్రం అయిన విధాన సౌధలో మళ్లీ వివాదాలు మొదలైనాయి. విధానసౌధకు రూ. 10 లక్షలు అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ అధికారి అడ్డంగా చిక్కిపోయారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సచివాలం, సీఎంతో పాటు మంత్రుల కార్యాలయాలు ఉండే చోట ప్రభుత్వ అధికారి రూ. 10 లక్షలతో ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ డబ్బు ఎక్కడిది అంటే ఆ ఇంజనీరు నీళ్లు నమిలాడు. పోలీసులు టైమ్ ఇచ్చినా ఆ అధికారి మత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకపోవడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) అసిస్టెంట్ ఇంజనీర్‌ను విధానసౌధ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. విధాన సౌధలో ఉద్యోగం చేస్తున్న మరో అధికారి పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి.

romance: నాటీ అల్లుడు, రొమాంటిక్ అత్త, అర్దరాత్రి అత్తను లేపుకుపోయిన కొత్త అల్లుడు, హయ్యారే హయ్యా !romance: నాటీ అల్లుడు, రొమాంటిక్ అత్త, అర్దరాత్రి అత్తను లేపుకుపోయిన కొత్త అల్లుడు, హయ్యారే హయ్యా !

విధాన సౌధ

విధాన సౌధ

కర్ణాటకలో రాష్ట్ర పరిపాలన అంతా విధాన సౌధ నుంచి జరుగుతోంది. కర్ణాటక శాసన సభ సమావేశాలు కూడా విధాన సౌధలో జరుగుతాయి. విధాన సౌధలో ఎంట్రీ ఇవ్వాలంటే సామాన్య ప్రజలకు సాధ్యం కాదు. వివిద జిల్లాల నుంచి వచ్చే అధికారులు సైతం ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించాలి. అధికారులు వచ్చే వాహనాలను విధాన సౌధ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తారు.

విధాన సౌధలో పని ఉందని వచ్చిన ఇంజనీర్

విధాన సౌధలో పని ఉందని వచ్చిన ఇంజనీర్

జగదీష్ బుధవారం సాయంత్రం పని నిమిత్తం విధాన సౌదకు వెళ్లేందుకు కారులో వచ్చాడు. అనంతరం విధాన సౌధ పశ్చిమ ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డులు, పోలీసులు ఇంజనీర్ జగదీష్ కారును తనిఖీ చేయగా బ్యాగులో పెద్ద మొత్తంలో డబ్బు చిక్కింది. కారులో దొరికిన డబ్బుపై సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం డబ్బుతో పాటు జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని బెంగళూరు సెంట్రల్ డీసీపీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

టైమ్ ఇచ్చినా తడబాటు ఎందుకు ?

టైమ్ ఇచ్చినా తడబాటు ఎందుకు ?

రూ. 10 లక్షల డబ్బు విషయంలో విధాన సౌద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు సమర్పించేందుకు సమయం కావాలని ఇంజనీర్ జగదీష్‌ పోలీసులను కోరారు. ఇందుకు అంగీకరించిన పోలీసు అధికారులు సరైన పత్రాలతో పాటు గురువారం విచారణకు హాజరుకావాలని, తరువాత నీ డబ్బు నువ్వు తీసుకుని వెళ్లాలనని పోలీసు అధికారులు ఇంజనీర్ జగదీష్ కు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కూడా ఇంజనీర్ జగదీష్ విచారణకు సహకరించడం లేదని, అందుకే అతన్ని సుదీర్ఘ విచారణ చేసిన అనంతరం అరెస్టు చేశామని డీసీపీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

డీలింగ్ డబ్బు ?

డీలింగ్ డబ్బు ?

జగదీష్ మండ్య జిల్లాలో చాలా రోజులుగా పిడబ్ల్యుడి డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని, అతను ఒక కాంట్రాక్ట్ పనికి సంబంధించిన డీల్ కోసం విధానసౌడలో ఒక అధికారిని కలవడానికి వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 10 లక్షలకు పీడబ్ల్యూడీ శాఖకు చెందిన మరో సీనియర్‌ అధికారికి సంబంధం ఉందని, అందుకే జగదీష్ విధాన సౌధలోకి వెళ్లడానికి ప్రయత్నించాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ అధికారి ఆదేశాల మేరకే జగదీశ్‌ మండ్య నుంచి రూ. 10 లక్షలు డబ్బులు తీసుకుని బెంగళూరు వచ్చాడని సమాచారం.

కోటీ రూపాయలతో ఎంట్రీ ఇచ్చిన లాయర్

కోటీ రూపాయలతో ఎంట్రీ ఇచ్చిన లాయర్

బెంగళూరులోని విధాన సౌధలోకి అక్రమంగా డబ్బులు తరలించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో విధాన సౌదా పశ్చిమ ద్వారం వద్ద సీనియర్ న్యాయవాది నుండి రూ. 1.08 కోట్లు. 2019లో రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పుట్టరంగ శెట్టికి ఆ డబ్బు చెందినదని తెలుసుకున్న పోలీసులు ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు సైతం విధాన సౌధలకు భారీ మొత్తంలో డబ్బు పెట్టుకుని వెళ్లడానికి సహసం చెయ్యరు. అతి పెద్ద శాఖగా చెప్పుకునే పీడబ్ల్యూడీకి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ జగదీష్ యవ్యారంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో పోలీసులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు.

English summary
The engineer was arrested and charged Rs. 10 lakhs seized by the Vidhana Soudha police in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X