Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముస్లీం మహిళతో అక్రమ సంబంధం, మేడమ్ బంధువులు ఆర్ టీఐ కార్యకర్తను ఏం చేశారంటే ?

బీజేపీ అధికారంలో ఉంటే మోరల్ పోలీసు దందాలు ఎక్కువ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే నైతిక్ పోలీసింగ్, మోరల్ పోలీసులను ఉక్కుపాదంతో తొక్కేస్తామని కాంగ్రెస్ నాయకులు పదేపదే చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మోరల్ పోలీసు గిరి ఎక్కువ కావడంతో ప్రజలు హడలిపోయారు.

కర్ణాటకలోని సముద్ర తీరప్రాంతాల్లో మోరల్ పోలీసింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవల శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కర్ణాటక, చిత్రదుర్గలో కూడా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఆ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. ముస్లిం మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణతో చిత్రదుర్గ జిల్లా హోల్‌కెరె రోడ్డులో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు.

The family members of the woman who had an illicit relationship attacked the RTI worker

దాడికి గురైన వ్యక్తి సామాజిక కార్యకర్త బీహెచ్ గౌడ్ అని పోలీసులు అన్నారు. ఆర్ టీఐ కార్యకర్త బీహెచ్ గౌడ ఓ ముస్లిం మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో గౌడ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆ ముస్లీం మహిళ ఆర్ టీఐ కార్యకర్త గౌడ కారులో కుర్చుని షికార్లకు, విహార యాత్రలకు తిరుగుతోందని తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు బీహెచ్ గౌడ్ ను ఆమెతో అక్రమ సంబంధం మానుకోవాలని కొన్ని సార్లు అతనికి వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. అయితే ముస్లీం మహిళతో ఆర్ టీఐ కార్యకర్త తిరుగుతూనే ఉన్నాడని, ఇద్దరు అక్రమ సంబంధం మానుకోవడానికి సిద్దంగా లేరని తెలిసింది. ఇదే సమయంలో ముస్లీం మహిళ కుటుంబ సభ్యులు ఆర్ టీఐ కార్యర్త గౌడ కారులో వెలుతున్న సమయంలో అతని కారును అడ్డుకుని అతన్ని కారులో నుంచి బయటకు లాగేశారు.

తరవాత కొందరు వ్యక్తులు కలిసి ఆర్ టీఐ కార్యకర్త గౌడ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. ఆర్ టీఐ కార్యకర్తను చితకబాదుతున్న సమయంలో కొందరు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ వీడియోలు విపరీతంగా వైరల్‌ అయ్యాయి. చిత్రదుర్గ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నైతిక పోలీసులను తరిమికొడతామని సీఎం సిద్ధరామయ్య పదేపదే చెప్పారు.

కానీ కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి తప్పా ఏమాత్రం తగ్గడం లేదు. మోరల్ పోలీసింగ్‌ను నియంత్రించడంలో సిద్దరామయ్య ప్రభుత్వం విఫలం అయ్యిందా? అనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలకే పరిమితమైన మోరల్ పోలీసింగ్ ఇప్పుడు చిత్రదుర్గాకు కూడా విస్తరించిందని ప్రజలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+