ఓవర్ గా ఆలోచించిన మేడమ్, సీటు తన్నుకుపోయిన మాజీ సీఎం, సుధాకర్ రెడ్డి, దెబ్బకు ఢమాల్ !
లోక్ సభ ఎన్నికల పోరులో రోజురోజుకు సీన్ మారిపోతున్నది. ఎప్పుడు ఎవరు ఏ సీటు తున్నుకుని వెళ్లిపోతున్నారో చెప్పడం చాలా కష్టం అయ్యింది. క్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో ఇంతకాలం వార్తల్లో నిలిచిన హాట్ నియోజక వర్గం అయిన మండ్య లోక్‌సభ నియోజకవర్గం ఎట్టకేలకు జేడీఎస్ దళపతుల చేతుల్లోకి వెళ్లిపోవడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
మండ్యలో జేడీఎస్ నాయకులు పోటీ చేస్తారని ఇంతకాలం ప్రచారంలో ఉన్న మండ్యను ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఆ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి దళపతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ నోట్లో వెలక్కాయపడినట్లు అయ్యింది. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కూటమిగా ఏర్పడి ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ చేరిన తరువాత కర్ణాటకలో సీన్ మారిపోయింది.

పొత్తులో ధర్మంగా జేడీఎస్ కోరిన మండ్య, హాసన్, కోలార్ లోక్ సభ నియోజకవర్గాలను బీజేపీ వదులుకుంది. రాజకీయాల కోసం తాను మండ్యను వదిలి వెళ్లనని సిట్టింగ్ ఎంపీ సుమలత చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నారు. తాను మండ్యను వదిలి వెళ్లనని, బెంగళూరు నార్త్ కు వెళ్లనని, చిక్కబళ్లాపురం నుంచి తాను పోటీ చెయ్యనని, మండ్యలో తనకు సీటు వస్తుందని వంద శాంతం కాదని, 500% శాతం తనకు మండ్యలోనే టిక్కెట్టు వస్తుందని ఇంతకాలం సిట్టింగ్ ఎంపీ సుమలత మొండిగా వ్యవహరించారు.
అయితే మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్‌కి ఎట్టకేలకు బీజేపీ హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. సుమలతకు ఊహించని ఝలక్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఇప్పటికే బెంగళూరు నార్త్ ఎంపీ సీటు వేరే వాళ్లకు ఇచ్చేయగా ఇప్పుడు చిక్కబళ్లాపురం కూడా మాజీ మంత్రి డాక్టర్ కే సుధాకర్ రెడ్డి అలియాస్ సుధాకర్ కు ఇచ్చేడంతో సుమలతకు ఊహించని షాక్ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో మండ్యలో పోటీ చేసిన సుమలత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి ఆ నియోజక వర్గం గెలుచుకోవడానికి తీవ్రంగా పోరాడారు.
అయితే అప్పటి లోక్ సభ ఎన్నికల్లో సుమలత అంబరీష్ ఎంపీగా విజయం సాధించారు, ఇప్పుడు మండ్య లోక్‌సభ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు పొత్తులో భాగంగా మండ్య లోక్ సభ నియోజక వర్గాన్ని జేడీఎస్‌కు ఇచ్చారు. గత వారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తరువాత మీడియాతో మాట్లాడిన సుమలత మండ్య ఎంపీ టికెట్ ఇంకా ఖరారు కాలేదని ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. మండ్య లోక్ సభ నియోజకవర్గం టిక్కెట్ తనకు వస్తుందని సుమలత ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ హైకమాండ్ సర్వేల ఆధారంగా ఈసారి బీజేపీ నేతలు మండ్య లోక్‌సభ స్థానాన్ని జేడీఎస్‌కు వదిలేశారు. మండ్య సీటు అధికారికంగా జేడీఎస్ కు ఇచ్చేయడంతో ఇంతకాలం బీజేపీ టిక్కెట్ కోసం పోరాటం చేస్తున్న సుమలత షాక్ తిన్నారు. సుమలత తదుపరి ఎత్తుగడ ఏమిటి? అని మండ్య జిల్లా ప్రజలు చర్చ మొదలుపెట్టారు. మండ్య ఎంపీ సుమలత అంబరీష్ ముందున్న దారి ఏమిటి?, మండ్యలో మళ్లీ పార్టీలకతీతంగా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తారా ? అని మండ్య ప్రజలు చర్చ మొదలుపెట్టారు.
ఇంతకాలం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న మండ్య ఎంపీ సుమలత ఎత్తుగడ చాలా ఆసక్తికరంగా మారింది. మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తారా అనే ప్రశ్న తలెత్తింది. చాలా కాలంగా మండ్య టికెట్‌పై ఆశలు పెట్టుకున్న సుమలత అంబరీష్‌పై అతి విశ్వాసంతో బీజేపీ ఇచ్చిన అన్ని ఆఫర్లు కాదడంతో ఇప్పుడు ఆమెకు మొదటికే మోసంవచ్చిందని బీజేపీ నాయకులు అంటున్నారు. మండ్యలో పార్టీలకు అతీతంగా పోటీ చేయడంపై సుమలత ఆమె సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని కొందరు నాయకులు అంటున్నారు.

సుమలత మండ్య నుంచి పార్టీలకతీతంగా నిలబడితే గతసారి లాగా ఈసారి ఆత్మగౌరవ ఓట్లు పడవు అని సుమలతకు కూడా తెలుసు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సుమలత మళ్లీ మండ్యలో పోటీ చేసి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిసింది. గతంలో మండ్య జిల్లా కింగ్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన మీద ఉన్న సానుభూతి ఓట్లు ఆయన భార్య సుమలత అంబరీష్ కు పడ్డాయి. అయితే ఇప్పుడు మండ్యలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సుమలత ఓవర్ గా ఆలోచించడంతో మండ్య సీటును మాజీ సీఎం కుమారస్వామి, చిక్కబళ్లాపురం సీటును డాక్టర్ సుధాకర్ రెడ్డి తన్నుకుపోయారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications