ప్రియుడితో లేచిపోయిన కూతుర్ని అడ్డంగా నరికేశాడు, భార్య, మరదలు, తమ్ముడ్ని !
ప్రేమికుడితో కలిసి పారిపోయిందన్న కోపం, ఊరిలో పరువు పోయిందనే కారణంతో తండ్రి అతని సొంత కూతురిని కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపిన అమానవీయ ఘటన బెంగళూరు నగరంలో కలకలకం రేపింది. బెంగళూరులోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో మైసూరులోని హెచ్‌డీ కోటేకు చెందిన పల్లవి (17) అనే యువతి దారుణ హత్యకు గురైంది. పల్లవి తండ్రి గణేష్ (50)ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
పరప్పన అగ్రహార సమీపంలోని నాగనాథ్‌పూర్‌లోని డాక్టర్స్ లేఅవుట్ లో పల్లవి హత్యకు గురైయ్యిందని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హెచ్‌డీ కోటేకు చెందిన రైతు గణేష్, శారదమ్మ దంపతుల కుమార్తె పల్లవి ఓ కళాశాలలో ప్రథమ పీయూసీ (ఇంటర్) చదువుతున్నది, మనోజ్ అనే యువకుడి ప్రేమలో (love) పడిన పల్లవి అతనితో తిరగడం మొదలుపెట్టింది. దీంతో మనోజ్, పల్లవిల పరిచయం ప్రేమగా మారింది.

రానురానుప ప్రేమికులు పల్లవి, మనోజ్ ఇష్టం వచ్చినట్లు తిరగడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి గణేష్ అతని కుమార్తె పల్లవిని ప్రశ్నించాడు. ఈ విషయంలో తండ్రి గణేష్ తో గొడవలు ఎక్కువ కావడంతో పల్లవి ఆమె ప్రియుడు మనోజ్‌తో కలిసి పారిపోయింది. ఆ తర్వాత గణేష్ అతని బంధువులు కలిసి కుమార్తె పల్లవిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి ఆమెను కాలేజీకి వెళ్ల్కుండా ఇంట్లోనే వదిలేశారు.
పల్లవిని ఆమె ప్రేమికుడు మనోజ్‌కి దూరం చేయాలనే ఉద్దేశంతో గణేష్ ఓ ప్లాన్ వేశాడు. బెంగళూరులోని (Bengaluru) పరప్ప అగ్రహారలోని డాక్టర్స్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న మరదలు (sister in law) గీతా (శారదమ్మ సోదరి) ఇంట్లో పల్లవిని వదిలి కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన గణేష్ తరువాత మైసూరు వెళ్లిపోయాడు. చిన్నమ్మ ఇంటిలో ఉంటున్న పల్లవి ఈనెల 14వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న గణేష్ దంపతులు బెంగళూరు వచ్చి 18వ తేదీన మా కూతురు పల్లవి అదృశ్యం అయ్యిందని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ప్రేమికుడు మనోజ్ తో పారిపోయిన పల్లవిని గుర్తించి ఈనెల 20వ తేదీన పట్టుకున వచ్చి ఆమె తండ్రి గణేష్ కు అప్పగించారు. 21వ తేదీన ఇదే విషయమై గణేష్ అతని కూతురు పల్లవితో గొడవ పడ్డాడు. ఆవేశంలో నువ్వు నీ ప్రియుడు (boyfriend) మనోజ్ పారిపోవడం, ఎక్కడా కనిపించకుండా పోవడంతో ఊర్లో నా పరువు పోయింది అంటూ కూతురు పల్లవితో గొడవపడ్డాడు.
ఆ సమయంలో సహనం కోల్పోయిన గణేష్ కొడవలితో అతని కూతురు పల్లవి మీద దాడి చేశాడు. ఈ సమయంలో గొడవను అడ్డుకోవడానికి అడ్డుపడిన భార్య శారదమ్మపై ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్ నువ్వు నీ కూతుర్ని సరిగా పెంచలేదు అంటూ కొడవలితో భార్య మీద దాడి చేశాడు. కూతురు పల్లవి, భార్య శారదమ్మను కొడవలితో నరికేసిన గణేష్ ఊగిపోయాడు.
అదే సమయంలో ఇంటికి వచ్చిన మరదలు గీతా, ఆమె భర్త శాంతకుమార్ మీద గణేష్ రగిలిపోయాడు. నా కూతురిని మీరు సరిగా చూసుకోలేదు అంటూ కొడవలితో వీరి ఇద్దరి మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ దాడిలో తీవ్రగాయాలైన కూతురు పల్లవి అక్కడే మృతి చెందింది. శారదమ్మ, గీతా, శాంతకుమార్‌లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కూతురు పల్లవిని హత్య చేసి ముగ్గురు కుటుంబ సభ్యుల మీద కొడవలితో దాడి చేసిన గణేష్ నేరుగా పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గురైన పల్లవి చిన్నమ్మ గీతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్ మీద హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు గణేష్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు.
నాగనాథ్‌పూర్‌లోని డాక్టర్స్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న పల్లవిని ఆమె ప్రియుడు మనోజ్ ఈనెల 14వ తేదీన హెచ్‌డీ కోటేలోని అతని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. మైనర్ అయిన పల్లవిని మనోజ్ లైంగిక వేధింపులకు గురి చేసిన మనోజ్ ఆమెను శారీరకంగా హింసించాడని అతని మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు అచేసి అరెస్టు చేశామని బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీసులు తెలిపారు. మొత్తం మీద ప్రియుడితో పారిపోయిన కూతురిని పరువు హత్య చేసిన తండ్రి అతని కుటుంబ సభ్యుల మీద కొడవలితో దాడి చెయ్యడం బెంగళూరులో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications