Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2008 అహ్మదాబాద్ వరుసపేలుళ్ల కేసులో దోషి తండ్రి ఎస్పీ తరపున ప్రచారం: యోగి సంచలనఆరోపణ

ఉత్తరప్రదేశ్లో పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న సమయంలో శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం నాడు 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది . మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. 56 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడిన 2008 వరుస పేలుళ్లలో ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సభ్యులకు ప్రత్యేక కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది.

సమాజ్ వాదీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు దోషి తండ్రి

సమాజ్ వాదీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు దోషి తండ్రి

ఈ తీర్పు తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషి అయిన ఓ ఉగ్రవాది తండ్రి సమాజ్ వాది పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఓ ఉగ్రవాది తండ్రి సమాజ్ వాది పార్టీతో కలిసి పని చేస్తూ, ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి పార్టీ అధికారంలోకి వ్క్యస్తే ఏం జరుగుతుందో ప్రజలకు బాగా తెలుసన్నారు. యూపీ ప్రజలు అలాంటి వారిని ఆదరించరు అని తేల్చి చెప్పారు.

ఉగ్రవాదులకు సమాజ్ వాదీ పార్టీ రక్షణ కల్పిస్తుంది: యోగి

ఉగ్రవాదులకు సమాజ్ వాదీ పార్టీ రక్షణ కల్పిస్తుంది: యోగి

సమాజ్‌వాదీ పార్టీ ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును చారిత్రాత్మక తీర్పు గా పేర్కొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరణశిక్ష విధించబడిన 38 మందిలో ఒకరు అజంగఢ్‌లోని సంజర్‌పూర్‌కు చెందినవారని పేర్కొన్నారు. కాన్పూర్ మరియు లక్నోలో ఎన్నికల సమావేశాలలో ప్రసంగించిన ముఖ్యమంత్రి సంజర్ పూర్ కు చెందిన ఉగ్రవాది తండ్రి సమాజ్ వాది పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ హయాంలో ఎలాంటి ఉగ్రవాద ఘటనలు లేవు: యోగి

బీజేపీ హయాంలో ఎలాంటి ఉగ్రవాద ఘటనలు లేవు: యోగి

గత ఐదేళ్ల బీజేపీ పాలనలో ఎటువంటి ఉగ్రవాది ఘటన జరగలేదని, బిజెపి ప్రభుత్వం ప్రజల భద్రతకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చిందని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో సైఫాయి పండుగ జరిగేది. కానీ మా ప్రభుత్వ హయాంలో ఛత్ పూజ, మధుర మరియు బృందావన్‌లో రంగోత్సవ్, దేవ్ దీపావళి మరియు కుంభ్ వంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు యోగి ఆదిత్యనాథ్.

బీజేపీ ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా దక్కదు

బీజేపీ ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా దక్కదు

కర్హాల్‌లో బిజెపి ప్రత్యర్థులు డిపాజిట్ ను కూడా కోల్పోతారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆదివారం పోలింగ్ జరగనున్న కర్హల్ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం నాడు మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+