ప్రాణం తీసిన గదర్ 2 సినిమా, హిందుస్తాన్ జిందాబాద్ అంటే చంపేసిన క్లోజ్ ఫ్రెండ్స్ !
రాయ్ పూర్/ఛత్తీస్ గఢ్: స్నేహితులతో కలిసి సినిమా చూసిన యువకుడు అదే ఫ్రెండ్స్ చేతిలో హత్యకు గురైనాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్ జిల్లాలో గదర్ 2 సినిమా చూసి హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన 30 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.
మల్కిత్ సింగ్ అలియాస్ వీరూ (30 ) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసులు అన్నారు. వీరు హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిని తసావూర్, ఫైజల్, శుభం లహారే, తరుణ్ నిషాద్‌లుగా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 15న గదర్ సినిమా చూసిన తరువాత వీరు హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. వీరును అతని స్నేహితులు కొట్టి చంపడానికి ప్రయత్నించారని, తీవ్రగాయాలైన వీరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరణించిన మల్కిత్ సింగ్ అలియాస్ వీరు తండ్రి ఖుర్సీపర్ గురుద్వారా అధిపతి అని పోలీసులు తెలిపారు.
వీరు హత్యను ఖండిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు, సిక్కు సంఘం సభ్యులు జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఖుర్సిపర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సిక్కు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, వీరు బంధువులు, ప్రజలు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
మృతుడు మల్కిత్ అలియాస్ వీరు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వీరు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన మొబైల్ ఫోన్ లో గదర్ 2 సినిమా చూసిన మల్కిత్ సింగ్ తరువాత అందులోని సీన్లు చూసి ఆవేశంలో హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు.

ఇంతలో, అతని స్నేహితులు మల్కిత్ సింగ్ తమను వెక్కిరించేలా నినాదాలు చేశాడని, మా మతం వాళ్లను కించపరుస్తునన్నాడనే అనుమానంతో అతనిని దారుంగా కొట్టారని పోలీసులు తెలిపారు. స్నేహితులు రాడ్లు, కర్రలు, చేతులతో దారుణంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వీరును మొదట స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు రాయ్‌పూర్‌లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రికి వీరును తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కిత్ అలియాస్ వీరును రక్షించలేకపోయామని వైద్యులు అంటున్నారు. వీరు హత్య కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారని, మరొకరి కోసం గాలిస్తున్నామని ఓని సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications