girlfriend: దుబాయ్ ప్రియుడ్ని ఎయిర్ పోర్టులో కిడ్నాప్ చేసిన కిలాడీ లేడి, రూ, కోటి డీల్ !
చెన్నై/కన్యాకుమారి/కొచ్చి: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరికి పరిచయం అయ్యింది. రానురాను ఇద్దరూ ప్రేమలోపడ్డారు. ఒకే ఇంటిలో ఉంటున్న ఇద్దరు ఆరు నెలలపాటు సహజీవనం చేశారు. కొన్ని నెలల క్రితం ప్రియురాలు భారత్ వచ్చింది. తరువాత ప్రియుడికి ఫోన్ చేసిన ప్రియురాలు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నువ్వు వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడి తనను పెళ్లి చేసుకోవాలని ఏడ్చింది. ప్రియురాలు దూరం అవుతుందని భయంతో ప్రియుడు విదేశాల నుంచి భారత్ వచ్చాడు. ప్రియురాలు, ఆమె గ్యాంగ్ ఎయిర్ పోర్టులో దిగిన ప్రియుడిని అక్కడే కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి కొన్ని రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు.

దుబాయ్ లో ఉద్యోగాలు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని ఫళాయిలో నివాసముంటున్న ముఖైద్దీన్ అబ్దుల్ ఖాదర్ అలియాస్ ఖాదర్ (42) అనే వ్యక్తి దుబాయ్‌లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ భారీ మొత్తంలో జీతం సంపాధిస్తున్నాడు. కేరళలోని తిరువనంతపురంకు చెందిన ఇన్షా అనే యువతి దుబాయ్ లోనే ఉద్యోగం చేస్తున్నది. గత ఏడాది ఖాదర్ కు, ఇన్షాకు పరిచయం కావడంతో ఇద్దరూ స్నేహితులు అయ్యారు.

దుబాయ్ లో సహజీవనం
రానురాను ఖాదర్, ఇన్షా దగ్గర కావడంతో దుబాయ్ లోనే గత 6 నెలలుగా సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో నివసించారు. కొన్ని నెలల క్రితం ఇన్షా తిరువనంతపురం వచ్చింది. కొద్ది రోజుల క్రితం ప్రియుడు ఖాదర్ కు ఫోన్ చేసిన ఇన్షా మాఇంట్లో తన పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని, నువ్వు వెంటనే తిరువనంతపురం రావాలని బోరున విలపించింది. ప్రియురాలి కోసం ఖాదర్ దుబాయ్ నుంచి బయలుదేరాడు.

ఎయిర్ పోర్టులో ప్రియుడు కిడ్నాప్
ఈనెల 22న అబ్దుల్ ఖాదర్ తన ప్రియురాలిని చూసేందుకు దుబాయ్ నుంచి విమానంలో బయలుదేరి కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. విమానాశ్రయం నుంచి ఖాదర్ బయటకు రాగానే ఇన్షా, ఆమె సోదరుడు షఫీక్ సహా 8 మంది ముఠా ఖాదర్ ను కారులోకి ఎక్కించారు. ఆ హడావుడి చూసి షాక్ తిన్న ఖాదర్ నీకు ఎందుకు తొందర అని ప్రియురాలు ఇన్షాను అడిగాడు. అయితే ప్రియురాలు ఏమి చెప్పకుండా ఖాదర్ ను కిడ్నాప్ చేశారు.

కోటి రూపాయలు డిమాండ్
తరువాత ప్రియురాలు ఇన్షా తో కలిసి వచ్చిన ముఠా సభ్యులు కోటి రూపాయలు ఇవ్వాలని, లేదంటే నిన్ను చంపేస్తామని బెదిరించడంతో ఖాదర్ హడలిపోయాడు. తన ప్రియురాలు ఇన్షానే ఈ గ్యాంగ్ లీడర్ అని తెలుసుకున్న ఖాదర్ షాక్ అయ్యాడు. తన దగ్గర డబ్బు లేదని అంత త్వరగా డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని, కొంత సమయం కావాలని మనవి చేశాడు. తరువాత ఆ ముఠా ఖాదర్ ను తిరువనంతపురం సమీపంలోని కిరాయింగీల్ అనే రిసార్ట్‌కు తీసుకెళ్లి ఓ రూమ్ లో కట్టేసి చిత్రహింసలు పెట్టి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు.

ప్రియుడిని నిలువు దోపిడీ చేసింది
ఖాదర్ ను చితకబాదిన నిందితులు ఖరీదైన రెండు సెల్ ఫోన్లు, 5 తులాల బంగారు నగలు లాక్కొన్నారు. ఖాదర్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 17 లక్షల రూపాయలను ఈ ముఠాలోని ఓ సభ్యుడి బ్యాంక్ అకౌంట్ కు నెట్ బ్యాంకింగ్ ద్వారా బదిలి చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఖాదర్ ను నరకం చూపించి, చిత్రహింసలు పెట్టిన తరువాత తిరువనంతపురం విమానాశ్రయానికి సమీపంలో వదిలివెళ్లిపోయారు. ఈ విషయమై అబ్దుల్ ఖాదర్ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కన్నింగ్ ప్రియురాలు
తన ప్రియురాలు ఇన్షా, ఆమె అనుచరులు తనను కిడ్నాప్ చేశారని ఖాదర్ పిన్ టూ పిన్ పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇన్షాతో సహా 6 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులను కలవాలని స్కెచ్ వేసి దుబాయ్ నుంచి ప్రియుడు ఖాదర్ ను తిరువనంతపురం రప్పించి అతన్ని కారులో కిడ్నాప్ చేసి రిసార్ట్ లో బంధించి డబ్బు, నగలు దోచుకున్న అతని ప్రియురాలు ఇన్షా బ్యాక్ గ్రౌండ్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనతో తిరువనంతపురంతో పాటు కన్యాకుమారిలో కలకలం రేపింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications