ఆపరేషన్‌ సింధూర్‌ కంటిన్యూ, 100మంది హతం - పాక్ నడిబొడ్డున..!!

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. భారత ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తొలి విడత ఆపరేషన్ సింధూర్ లో పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం గురి పెట్టింది. ఆపరేషన్ సింధూర్ వివరాలను అఖిల పక్ష భేటీలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక, ఈ సమావేశం సమయంలోనే మరోసారి పాక్ కు భారత్ సైన్యం బుద్ధి చెప్పింది. భారత్ పై మిసైల్లతో దాడికి ప్రయత్నించగా మన సైన్యం వాటిని నిర్వీర్యం చేసింది. దీనికి ప్రతిగా భారత్ చర్యలతో లాహోర్, రావల్పిండి లోని ఏయిర్ ఢిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయింది.

ఆపరేషన్‌ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. "తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్ టుబెట్టాం. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని వివరించిన రాజ్ నాథ్ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు.

the-government-mentioned-that-operation-sindoor-is-still-underway

ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదని రాజనాథ్ తేల్చి చెప్పారు. ఇది కొనసాగుతున్న ఆపరేషన్‌ గనుక సాంకేతిక అంశాలను వెల్లడించలేకపోయామని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయని కొనియాడురు. ఈ అంశంలో రాజకీయాలకు తావు లేదని రిజిజు వెల్లడించారు.ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కొనసాగుతోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారని రాహుల్‌ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+