దెబ్బకు దెయ్యం దిగింది. రెచ్చిపోయారు. బుల్డోజర్లతో రోడ్డునపడిన రౌడీలు !
గురుగ్రామ్/హరియాణ: హింసాత్మకంగా మారిన హరియానాలోని నుహ్‌లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే పనిలో అక్కడి ప్రభుత్వం నిమగ్నం అయ్యింది. ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ దెబ్బకు రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ఇంకా పెంచుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్ దెబ్బతో మూడు అంతస్తులతో నిర్మించిన సహారా హోటల్ అక్రమ కట్టడాన్ని సంబంధిత అధికారులు నేలమట్టం చేశారు.
మూడు అంతస్తుల హోటల్ ను కూల్చివేయడానికి నుహ్ జిల్లా యంత్రాంగం బుల్‌డోజర్‌లను తీసుకువచ్చింది. మెడికల్ స్టోర్స్ సహా 12 షాపులను హరియాణ ప్రభుత్వం ధ్వంసం చేసింది. హింసాకాండకు గురైన నుహ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని టౌరులో నివసిస్తున్న వలసదారుల అక్రమ కట్టడాలను కుల్చివేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించారని అధికారులు అంటున్నారు.

ఇదే గుడిసెలు, ఇళ్లను ధ్వంసం చేశారని స్థానిక మీడియా తెలిపింది. కూల్చివేసిన దుకాణాలు నడుపుతున్న వారు, ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఇటీవల జరిగిన ఘర్షణల్లో పాల్గొన్న వారివేనని స్థానిక ప్రభుత్వ, పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 50 నుంచి 60 భవనాలు నేలమట్టమయ్యాయి. నుహ్ హింసకు పాల్పడిన వారు అరెస్టుకు భయపడి పారిపోయారు.

ఇదిలా ఉండగా ఇటీవల నాలుగు రోజులుగా నుహ్‌లోని పలు ప్రాంతాల్లో బుల్‌డోజర్ లో అక్రమ కట్టడాలు కూల్చి వేస్తున్న హరియాణ ప్రభుత్వం అల్లర్లలో పాల్గొన్న వారికి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ బుల్డోజర్లతో కఠిన చర్యలు చేపట్టింది. గత కొన్నేళ్లుగా తొలగించలేని అక్రమ ఇళ్లను తొలగించడం హింసకు పాల్పడుతున్న వారికి గుణపాఠం చెప్పడమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

గత సోమవారం విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై ఓ వర్గం వాళ్లు దాడులు చేయడంతో నుహ్‌లో జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక ఇమాత్ తో సహా ఆరుగురు చనిపోయారు. సాయంత్రం కాగానే హింస తీవ్రరూపం దాల్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మసీదుకు నిప్పు పెట్టారు. వందకు పైగా వాహనాలు దగ్ధమై ధ్వంసమయ్యాయి. నుహ్ మరియు పొరుగున ఉన్న గురుగ్రామ్‌పై అల్లరిమూకలు గుంపులు గుంపులుగా వెళ్లి దాడులు చేశారు.
హరియాణ హోం మంత్రి అనిల్ విజ్ దీని గురించి మాట్లాడుతూ హింస వెనుక పెద్ద గేమ్ ప్లాన్ ఉందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ తోసిపుచ్చింది. అయితే ఘర్షణల వెనుక సూత్రధారి ఎవరూ అనే విషయం కనుగొనలేదు అని పోలీసు నుహ్ సూపరింటెండెంట్ చెప్పారు. ఇప్పటి వరకు 106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసు అధికారులు 216 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టి అల్లర్లు వ్యాపించడానికి కారణం అయిన వారిపై ఇప్పటికే 24 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, హింసను ప్రేరేపించినందుకు నలుగురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications