hotel: భోజనం చేసి డబ్బులు ఇవ్వలేదని యువకుడిని చంపేసిన హోటల్ ఓనర్ !

చెన్నై/ తిరువళ్లూరు: కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఎప్పటిలాగే ఉదయం ఉద్యోగానికి వెళ్లి రాత్రి అతని రూమ్ కు చేరుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం కంపెనీలో పని చెయ్యడానికి వెళ్లిన యువకుడి ఆచూకిలేదు. తమ కొడుకు కనపడటం లేదని యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల తరువాత మాయం అయిన యువకుడు ఓ చెరువులో శవమై కనిపించడం కలకలం రేపింది.

తమిళనాడులోని తిరువళ్లారులోని శక్తివేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శక్తివేల్ తన కుమారుడు ప్రవీణ్ కుమార్ (25) అదృశ్యమైనట్లు చోళవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారుడు. చోళవరంలోని అచ్చి మసాలా కంపెనీలో శక్తివేల్ పనిచేస్తున్నాడు. ప్రవీణ్ స్వస్థలం సేలం. పని మీద ప్రవీణ్ కుమార్ చోళవరం వెళ్లాడు. ఈనెల 20వ తేదీన ప్రవీణ్ కుమార్ అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తరువాత ప్రవీణ్ కుమార్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

 The hotel owner killed the young man for leaving without paying for the meal in Tamil Nadu.

ఈ కేసులో అదృశ్యమైన ప్రవీణ్‌కుమార్‌ తన స్నేహితుడు రాజేంద్రన్‌తో కలిసి తాను పనిచేస్తున్న కంపెనీలో సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నల్లూరు చెల్లియమ్మన్ ఆలయ సమీపంలోని చెరువులో ప్రవీణ్ శవమై కనిపించాడు. ప్రవీణ్ తలకు బలమైన గాయాలయ్యాయి. పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు.

తరువాత ప్రవీణ్ హత్యకు గురైనాడని కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ప్రవీణ్‌కుమార్‌, రాజేంద్రన్‌లు ఈనెల 20వ తేదీన లక్ష్మీస్‌ హోటల్ లో భోజనం చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారని వెలుగు చూసింది. ఈ విషయాన్ని లక్ష్మి ఆమె కుమారుడు నరేష్‌కు చెప్పింది. నల్లూరు చెల్లియమ్మన్ దేవాలయం ప్రాంతంలో బైక్ లో వెలుతున్న ప్రవీణ్, అతని స్నేహితుడిని నరేష్ అడ్డగించాడు.

మా హోటల్ లో భోజనం చేసి రోజూ ఎందుకు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రశ్నించాడు. మాటల వాగ్వాదం తోపులాటగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన నరేష్ కర్రతో ప్రవీణ్ కుమార్‌ను వెంబడించి దాడి చేశాడు. ప్రవీణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పుఝల్ జైలులో ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+