ఉద్యోగం చేస్తున్న అందమైన భార్య మీద డౌట్, ఇంట్లో కాపాల ఉన్నాడు. అయితే ఏం జరిగిందంటే ?
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తన గోడు ఎవరితో చెప్పుకోవాలని భార్య ఆవేదన చెందింది. ఇదే సందర్బంలో అందమైన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. అయితే గొడవలు తారాస్థాయికి చేరడంతో భార్యను కత్తితో పొడిచి చంపేసిన భర్త అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
పేదరికంలో పుట్టి పెరిగిన శ్వేతా అనే యువతి చాలా తెల్లగా, సన్నగా అందంగా ఉంటుంది. కర్ణాటకలోని కొడగు- మైసూరు జిల్లాల సరిహద్దు గ్రామమైన ముల్లుసోగెకు చెందిన భాగ్య పెద్ద కూతురు ఈ శ్వేతా. శ్వేతా ఇంటర్ వరకు చదువుకుంది. తరువాత తల్లికి ఆర్థికంగా సహాయం చెయ్యాలని అనుకున్న శ్వేతా డిగ్రీ కాలేజ్ లో చేరకుండా కొడగులోని కుశాలనగర్‌లోని ఓ ప్రైవేట్ గార్మెంట్స్ లో ఉద్యోగంలో చేరింది.

ముత్తినముల్లుసోకు గ్రామంలో శ్వేతా దూరుపు బంధువులు చాలా మంది నివాసం ఉంటున్నారు. శ్వేతా దూరపు బంధువు అయిన ప్రసన్న అనే యువకుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేశాడు. శ్వేతా అందం చూసి ఫిదా అయిన ప్రసన్న ఆమె వెంట తిరిగి తనను ప్రేమించాలని చెప్పాడు. కొంతకాలం బంధువు ప్రసన్నతో స్నేహంగా ఉన్న శ్వేతా తరువాత అతని ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటే కట్నకానుకలు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే బంధువు ప్రసన్నను పెళ్లి చేసుకుంటే అలాంటి కట్నం ఇవ్వనసరం లేదని శ్వేతా అనుకుంది.
కొంతకాలం తరువాత శ్వేతా కూడా దూరపు బంధువు ప్రసన్నను ప్రేమించడం మొదలుపెట్టింది. ఏడాదిన్నర క్రితం తల్లి భాగ్యను ఒప్పించిన శ్వేతా ఆమె ప్రియుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత భార్య శ్వేతాను ప్రసన్న చాలా బాగా చూసుకున్నాడు. అయితే రానురాను అందంగా ఎర్రగా, నాజుకుగా ఉన్న భార్య శ్వేతా మీద ప్రసన్నకు అనుమానం మొదలైయ్యింది.
తాను ఉద్యోగం చెయ్యడానికి బయటకు వెళ్లిన తరువాత తన భార్య శ్వేతా ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యడానికి వెలుతోందని ప్రసన్న అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో కొంతకాలంగా ప్రసన్న, శ్వేతా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి, గొడవలు తారాస్థాయికి చేరడంతో నిత్యం గొడవపడటం మొదలుపెట్టారు. చివరికి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం మానేసిన ప్రసన్న ఇంట్లో అతని భార్య శ్వేతాకు కాపలా ఉండటం మొదలుపెట్టాడు.

ఉదయం ఉద్యోగానికి వెలుతున్న శ్వేతా సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నది. పనిపాటా చెయ్యకుండా గాలికి తిరుగుతున్న ప్రసన్న అతని భార్య శ్వేతా సంపాధిస్తున్న డబ్బుతో మద్యం సేవించి జల్సా చెయ్యడం మొదలుపెట్టాడు. ఉద్యోగం నుంచి సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం అయితే ఆరోజు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యడానికి వెలుతున్నావా ? అంటూ ప్రసన్న అతని భార్య శ్వేతాను చితకబాదేస్తున్నాడు.
భర్త ప్రసన్న చిత్రహింసలు ఎక్కువ కావడంతో నెల రోజుల క్రితం భర్త ప్రసన్న మీద మైసూరులోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన శ్వేతా తరువాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయి తల్లి భాగ్య, సోదరితో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రసన్న అతని భార్య శ్వేతా మీద రగిలిపోయాడు. తన భార్య శ్వేతాను చంపేసి కసితీర్చుకోవాలని ఎదురు చూశాడు. గురువారం ఉదయం శ్వేతా తల్లి భాగ్య, ఆమె సోదరి ఉద్యోగానికి వెళ్లారు.
ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లడానికి శ్వేతా బయలుదేరడానికి సిద్దం అయ్యింది. ఆ సందర్బంలో ఒక్కసారిగా శ్వేతా ఇంటిలోకి చొరబడిన ప్రసన్న ఆమెను చితకబాదేశాడు. తరువాత కత్తి తీసుకుని భార్య శ్వేతాను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. కత్తిపోట్లతోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేతా తనను రక్షించాలని చుట్టుపక్కల వాళ్లను వేడుకుంది. అయితే స్థానికులు మొబైల్ లో శ్వేతా వీడియోలు, ఫోటోలు తీశారు.

అయితే శ్వేతాను ఎవ్వరూ రక్షించడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. తరువాత రక్తపుమడుగులో పడిఉన్న శ్వేతా అతని కష్టం మీద ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది.
చెల్లెలి స్నేహితులు వెళ్లి శ్వేతాను మైసూరు జిల్లా ఆసుపత్రికి తరలించార. భార్య శ్వేతాను దారుణంగా పొడిచిన ప్రసన్న ఆమె చనిపోయింది అనుకుని అక్కడి నుంచి పరారైనాడు.
తరువాత ప్రసన్న అతను నివాసం ఉండే గ్రామం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్వేతా శుక్రవారం చనిపోయిందని పోలీసులు తెలిపారు. భార్య శ్వేతా అక్రమ సంబందం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను హత్య చేసిన ప్రసన్న పోలీసు కేసు భయంతో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications