Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

one lakh: ఆంధ్రా వ్యక్తి హత్య కేసులో ట్విస్ట్, నీ భార్యను అక్కడ పడుకోబెట్టురా అంతా సరిపోతుంది, అంతే !

బెంగళూరు/తిరుపతి: రాత్రి బైక్ లో ఇంటికి వెలుతున్న ఆంధ్రా వ్యక్తిని మార్గం మధ్యలో అడ్డగించిన నిందితుడు అతన్ని వేటకొడవలితో నరికి హత్య చేసి పరారైనాడు. నడిరోడ్డు మీద హత్య జరగడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. హత్యకు గురైన వ్యక్తి, అతని భార్య గురించి, వారి స్నేహితుల గురించి పోలీసులు మొత్తం మ్యాటర్ బయటకు లాగారు. ఆంధ్రా వ్యక్తిని అతని స్నేహితుడే హత్య చేశాడని వెలుగు చూసింది. లక్ష రూపాయల విషయంలో నీ భార్యను అక్కడ పడుకోబెట్టు అంతా సరిపోతుంది అనే డైలాగ్ నడిరోడ్డు మీద ఒకరి హత్య జరిగే వరకు దారితీసిందని పోలీసులు అన్నారు.

 అందుకేనా

అందుకేనా

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దినేష్‌ అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నైస్‌ రోడ్డు సమీపంలోని మంగనహళ్లిలో చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేసిన దినేష్ బెంగళూరులోనే సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాడు. దినేష్ నైస్ రోడ్డు సమీపంలో ఇంటి స్థలం కూడా కొనుగోలు చేశాడు. దినేష్ పిల్లలు అదే ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు.

మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

బుధవారం రాత్రి దినేష్ పని ముగించుకుని రాత్రి బైక్ లో ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఎవరో ఆపి అతన్ని దారుణంగా హత్య చేశారు. జ్ఞానభారతి పోలీసులు మృతుడి కుటుంబసభ్యులను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఆ సమయంలో దినేష్ ఆర్థిక లావాదేవీల గురించి అతని భార్య లక్ష్మీ పోలీసులకు చెప్పింది. దినేష్ హత్య కేసులో పోలీసులు అరుణ్ అనే యువకుడిని పట్టుకున్నారు.

ఇద్దరూ స్నేహితులు

ఇద్దరూ స్నేహితులు


దినేష్ కార్పెంటర్‌ పనితో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఇంటి అద్దె బ్రోకర్‌గా పనిచేసేవాడు. బుధవారం రాత్రి దినేష్ మొబైల్‌కు అతని స్నేహితుడు అరుణ్ ఫోన్ చేశాడు. అరుణ్ ఫోన్ కాల్ రావడంతో తనకు అత్యవసర పనిపడిందని కుటుంబ సభ్యులకు చెప్పిన దినేష్ బైక్ లో వెళ్లిపోయాడు. విశ్వేశ్వరయ్య లేఅవుట్‌కు వెళ్లే దారిలో దినేష్‌ను నరికి చంపేశారు. దినేష్ ను తానే హత్య చేశానని అతని స్నేహితుడు అరుణ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

రూ. 1 లక్షకు ప్రతినెల రూ. 10 వేలు వడ్డి

రూ. 1 లక్షకు ప్రతినెల రూ. 10 వేలు వడ్డి

కార్పెంటర్ దినేష్, పెయింటర్ అరుణ్ చాలా సంవత్సరాలుగా స్నేహితులు, రెండేళ్ల క్రితం ఈ స్నేహం కారణంగా 10 శాతం వడ్డీకి లక్షరూపాయలు దినేష్ దగ్గర అరుణ్ తీసుకున్నాడు. అప్పటి నుంచి లక్ష రూపాయలకు ప్రతినెల రూ. 10వ వేలు వడ్డీని అరుణ్ అతని స్నేహితుడు దినేష్ కు చెల్లించారు. నిందితుడు అరుణ్ అతని స్నేహితుడు దినేస్ కు ముందస్తు ఒప్పందం ప్రకారం వడ్డీ చెల్లించలేకపోయాడు.

నీ భార్యను అక్కడ పడుకోబెట్టురా డబ్బులు వస్తాయి

నీ భార్యను అక్కడ పడుకోబెట్టురా డబ్బులు వస్తాయి


ఇటీవల అప్పు తీసుకున్న లక్ష రూపాయాలకు రూ. 10 వేలు వడ్డీ చెల్లించలేక పోవడంతో స్నేహితులు దినేష్, అరుణ్ ల మధ్య మనస్తాపం నెలకొంది. రెండు మూడుసార్లు ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగిందని తెలిసింది. తీసుకున్న అప్పు కట్టలేకపోతే నీ భార్యను ఎవడి దగ్గరైనా కుదువ పెట్టు, లేదంటే పది మంది పక్కలో పడుకోబెట్టు అని దినేష్ అతని స్నేహితుడు అరుణ్ ను నీచంగా మాట్లాడాడని తెలిసింది. తన భార్యను చులకనగా మాట్లాడిన దినేష్ ను చంపేయాలని అరుణ్ డిసైడ్ అయ్యాడు. అప్పటి నుంచి రగిలిపోతున్న అరుణ్ బుధవారం రాత్రి దినేష్ కు ఫోన్ చేసి రూ. లక్ష రూపాయలు ఇస్తానని పిలిపించి మార్గం మధ్యలోనే మారణాయుధంతో నరికి చంపేశాడని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+