రోజుకు రెండు చీరలు కడుతున్న భార్య, రాత్రి అయితే నైటీ ఎందుకు ?, పెట్రోల్ ఎత్తుకుపోయి పోసేసి ?

పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. కష్టపడి పనిచేస్తున్న భర్త అతని భార్యను బాగా చూసుకునేవాడు. అయితే వివాహం జరిగిన 15 ఏళ్ల తరువాత తేడాలు వచ్చాయి. ఉదయం భర్త బయటకు వెళ్లిన తరువాత శుభ్రంగా రెడీ అవుతున్న భార్య మీద ఆమె భర్తకు అనుమానం వచ్చింది. నేను ఇంటికి వస్తే నైటీ వేసుకుని తిరిగే భార్య పగలు మాత్రం చీరలో ఎందుకు ఉంటోంది ? అంటూ భర్తకు డౌట్ వచ్చింది.

బెంగళూరులోని కదిరేనహళ్లిలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ అనే వ్యక్తి అరెస్టు అయిన నిందితుడు. మంటల్లో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ భార్య పుష్పమ్మ అలియాస్ పుష్పాను విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు.

The husband poured petrol on his wife and set her on fire for having an illicit relationship in Bengaluru

18 ఏళ్ల క్రితం శ్రీనివాస్, పుష్పాకు వివాహమైంది. ప్లంబర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ గతంలో అతని భార్య పుష్పాతో చాలా సంతోషంగా ఉండేవాడని తెలిసింది. మూడు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ కు అతని భార్య పుష్పా మీద అనుమానం మొదలైయ్యింది. తన భార్య పుష్పాకు అక్రమ సంబంధం ఉందని, తాను ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి ఆమె చీరలు మార్చిమార్చి కట్టుకుంటూ బయటకు వెలుతోందని శ్రీనివాస్ కు అనుమానం మొదలైయ్యింది.

ఇదే విషయమై భార్య పుష్పాతో ఆమె భర్త శ్రీనివాస్ తరచూ గొడవ పడేవాడు. ఈ విషయమై చాలాసార్లు శ్రీనివాస్, పుష్పా దంపతుల మధ్య చాలాసార్లు గొడవలు జరిగినట్లు ఇరుగుపొరుగు వారికి తెలింది. పెద్దలు చాలాసార్లు పంచాయితీలు చేసినా శ్రీనివాస్ మాత్రం అతని పద్దతి మార్చుకోలేదని, నిత్యం అతని భార్య పుష్పాను పట్టుకుని చితకబాదేవాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

చివరికి పెద్దలు పెద్ద పంచాయితీ చెయ్యడంతో ఇక ముందు తన భార్య పుష్పాతో సంతోషంగా ఉంటానని అందరి ముందు శ్రీనివాస్ చెప్పాడు. అంతా బాగానే ఉందని అందరూ అనుకున్నారు. అయితే శ్రీనివాస్ మళ్లీ అతని భార్య పుష్పా అక్రమ సంబంధం విషయంపై మళ్లీ అనుమానం పెంచుకుని గొడవకు దిగాడు. నవంబర్ 16వ తేదీన ఇదే విషయమై శ్రీనివాస్, పుష్పా దంపతులు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు.

The husband poured petrol on his wife and set her on fire for having an illicit relationship in Bengaluru

ఈ సమయంలో నిందితుడు శ్రీనివాస్ ముందుగా పక్కాప్లాన్ ప్రకారం వెంట తీసుకెళ్లిన పెట్రోల్ అతని భార్య పుష్పా మీద పోసి వెంటనే ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేసి నిప్పంటించాడు. అనంతరం నిందితుడు శ్రీనివాస్ భయపడి భార్య పుష్పా మీద అతనే నీళ్లు పోశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెళ్లి పుష్పాకు అంటుకున్న మంటలు అదుపుచేశారు. తీవ్రగాయాలైన పుష్పా విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మంగళవారం అసలు విషయం తెలుసుకున్న పుష్పా కుటుంబ సభ్యులు బనశంకరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు పుష్పా భర్త శ్రీనివాస్ ను అరెస్టు చేసి అతన్ని విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా భార్య పుష్పాను ఆమె భర్త సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించడంతో తీవ్రగాయాలైన పుష్పా ఆసుపత్రిలో చావుబతుల మధ్య పోరాడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+