భార్య సోషల్ మీడియాలో పెద్ద స్టార్, లక్ష మంది ఫాలోవర్స్ రివాల్వర్ కాల్చిపారేసిన భర్త !

భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న సోషల్ మీడియా సెలబ్రిటీని ఆమె భర్త కాల్చి చంపిన షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియా సెలబ్రిటీని స్పాట్ లో కాల్చి చంపేసిన భర్త ఆమె ప్రాణం పోయిందని ఊపిరిపీల్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

అనామికా బిష్ణోయ్ అనే మహిళ ఆమె భర్త చేతిలో హత్యకు గురైందని పోలీసులు అన్నారు. అనామికా బిష్ణోయ్ సోషల్ మీడియా స్టార్ అని పోలీసులు అన్నారు. అనామికా బిష్ణోయ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారని పోలీసులు అంటున్నారు, అనామిక వీడియోలు, ఆమె చేస్తున్ రీల్స్ ను చూడటానికి చాలా మంది వేచి ఉంటారని తెలిసింది. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనామికాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని పోలీసులు అంటున్నారు.

The husband shot dead the social media star with a revolver in Rajasthan.

రాజస్థాన్‌లోని ఫలోడిలో అనామికా హత్యకు గురైయ్యింది. సోషల్ మీడియా స్టార్ అనామిక హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చూస్తే అనామికను ఆమె భర్త ఎలా హత్య చేశాడు అని స్పస్టంగా తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. అనామికా బిష్ణోయ్ ఆమె భర్తతో విడిపోయి వేరుగా ఉంటూ సోషల్ మీడియాలో వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పోస్టు చేస్తున్నదని పలోీసులు అన్నారు.

అనామిక ఆమె షాపులో కూర్చొని ఉండగా ఆమె భర్త అక్కడికి వచ్చి ఆమెను చాలా సమీపం నుండి 3 నుండి 4 సార్లు కాల్చాడు. ఇలా దారుణంగా భార్య అనామికను హత్య చేసిన ఆమె భర్త పేరు మహిరామ్‌ అని పోలీసులు అన్నారు. భర్త మహిరామ్ కు దూరంగా ఉంటున్న అనామిక రాజస్థాన్‌లోని ఫలోడిలో లేడీస్ షాపింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నదని పోలీసులు తెలిపారు.

ఈ షాపులో కూర్చున్న అనామికాను ఆమె భర్త మహిరామ్ కాల్చి చంపాడు. భార్య అనామికా షాపులోకి వెళ్లిన భర్త మహిరామ్ ఆమోతో గొడవ పెట్టుకుని చాలా సేపు ఆమెతో వాదించాడని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యిందని పోలీసులు అన్నారు. తరువాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనామికా ఆమె భర్త మహిరామ్ కు చెయ్యి చూపించి చెప్పిందని, తరువాత ఆవేశంలో అతను అనామికాను రివాల్వర్ తో కాల్చి చంపేశాడని సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని పోలీసులు తెలిపారు.

భార్య అనామికాను హత్య చేసిన తరువాత మహిరామ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని, భార్య అనామిక ఆమె భర్త మహిరామ్ మీద వేసిన వరకట్న కేసు విచారణ కోర్టులో ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కుటుంబ గొడవల కారణంగానే అనామిక హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+