Wife: వైఫ్ తో పెట్టుకున్నాడు, వైఫై చిక్కని ప్లేస్ లోకి వెళ్లిపోయాడు, అవసరమా రా ? !
బెంగళూరు/చిక్కమగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. అయితే తరువాత మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి, దెబ్బకు భర్త మొదట తాగుబోతు, తరువాత వీరతాగుబోతు అయ్యాడు. వైఫ్ తో పెట్టుకుని చివరికి వైఫై లేని చోటకు భర్త వెళ్లిపోయాడు.
జీవితాంతం తనతో పాటు ఉంటానని చెప్పిన భార్య మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఆమెను కొట్టి చంపిన నిందితుడికి జీవిత ఖైదు జైలు శిక్షపడింది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కోర్టు నిందితుడిని జైలుకు పంపించాలని తీర్పు ఇచ్చింది. చిక్కమగళూరు జిల్లాలోని కడూరు తాలూకా పంచనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కవలుహట్టికి చెందిన శేఖరప్పకు శిక్ష పడింది.

మరుసటి రోజు గీతాను ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించి ఇంట్లోనే ఉంచారు. ఉదయం గీతాను ఆస్పత్రికి తరలించేందుకు నిద్రలేచి చూసేసరికి ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు గీతాను హత్య చేసిన ఆమె భర్త శేఖరప్ప మీద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువైన నేపథ్యంలో 2వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బీసీ భానుమతి నిందితుడు శేఖరప్పకు జీవిత ఖైదు శిక్ష విధించారు.












Click it and Unblock the Notifications