మటన్ కత్తిరించే కత్తితో భార్యను అందరి ముందు నరికేసిన భర్త, అసలు మ్యాటర్ తెలిసి !

బెంగళూరు/కోలారు: భార్యను కొట్టడంతోపాటు కూతురిని కాపాడేందుకు వచ్చిన మామను కూడా కొట్టాడు. చివరికి కిరాతకుడు భార్యను బ్రతకనివ్వలేదు. కర్ణాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపూర్ తాలూకా నంబిహళ్లి గ్రామంలో జరిగిన దారుణం జరిగిది. భార్యను దారుణంగా నరకడమే కాకుండా మామ, అడ్డు వెళ్లిన వారి మీద మటన్ కత్తిరించే కత్తితో ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

భార్యను అత్యంత కిరాతకంగా చంపిన హంతకుడి పేరు నగేష్. కోలారు జిల్లా శ్రీనివాస్ పురం పట్టణంలో మటన్ దుకాణం పెట్టుకుని నాగేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య రాధ బతికే ఉంది. మొదటి భార్య బతికుండగానే నగేష్ రెండో పెళ్లి చేసుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తూ కాలం గడుతున్నాడు. మొదటి భార్య రాధ ఆమె స్వగ్రామమైన నంబిహళ్లి గ్రామంలో చిల్లర దుకాణం నిర్వహిస్తూ, టైలర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

The husband who killed the first wife with a mutton knife near Kolar in Karnataka.
రెండో పెళ్లి చేసుకున్న నగేష్ కుటుంబ పోషణతో పాటు పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో అతని మొదటి భార్య రాధ విసిగిపోయింది. రెండో భార్యకు మాత్రమే పరిమితం అయిన నగేష్ ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అనుకున్న అతని మొదటి భార్య రాధ తనకు విడాకులు ఇవ్వాలని, తన దారి తాను చూసుకుంటానని భర్త నగేష్ కు చెప్పింది.

మొదటి భార్య రాధ విడాకులు కోరడంతో నగేష్ రగిలిపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన నగేష్ అతని మటన్ షాపులో మటన్ కత్తిరించే కత్తి తీుకుని నేరుగా మొదటి భార్య రాధ ఇంటికి వెళ్లాడు. తరువాత నగేష్ అతని భార్య రాధను చితకబాదేశాడు. కూతురి హత్యను అడ్డుకునేందుకు వచ్చిన మామ మునిరాజుపై కూడా నగేష్ దారుణంగా కత్తితో దాడి చేశాడు.

రాధను నరికి చంపిన నగేష్ పై గ్రామస్తులు తిరగబడ్డారు. నగేష్‌ను చుట్టుముట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నగేష్ కొడవలితో ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో గ్రామస్తులు నగేషక తలదాచుకున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను అడ్డుకుని ఇంటికి వ్యాపించిన మంటలు అదుపు చేశారు. రాధను హత్య చేసిన నగేష్ ను అరెస్టు చేశామని, రాధ తండంరిని కోలారు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+