Indian Navy: ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. వారంతా సురక్షితం..
సోమాలియా తీరంలో హైజాక్ గురైమ MV లీలా నార్ఫోక్ అనే నౌక, అందులోని సిబ్బందిని భారత నావికాదళం రక్షించింది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS చెన్నై.. సోమాలియా తీరంలో హైజాక్ అయిన MV లీలా నార్ఫోక్ అనే నౌకను చేరుకుంది. ఓడలో భారత నావికాదళ కమాండోలు ఎక్కారు. 'బోర్డులో ఉన్న మొత్తం 21 మంది సిబ్బంది (15 మంది భారతీయులతో సహా) సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి నేవీ ఈ ఆపరేషన్ చేపట్ంది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి.. హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు వివరించింది. అంతకు ముందు భారత యుద్ధనౌక హెలికాప్టర్‌ను ప్రయోగించి, హైజాక్ చేసిన నౌకను విడిచిపెట్టాలని సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

"INS చెన్నై తన యాంటీ పైరసీ పెట్రోలింగ్ నుంచి మళ్లించింది. ఈ రోజు 15:15 గంటలకు MVని అడ్డగించింది. MVని మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, ప్రిడేటర్ MQ9B, ఇంటిగ్రల్ హెలోస్ ఉపయోగించి నిరంతర నిఘాలో ఉంచారు. మిషన్ డిప్లాయ్డ్ వార్‌షిప్‌లో ఉన్న ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు MV ఎక్కి శానిటైజేషన్‌ను ప్రారంభించారు" అని భారత నావికాదళం తెలిపింది.
లైబీరియా జెండాతో కూడిన బల్క్ క్యారియర్‌ను హైజాక్ చేయడానికి ప్రయత్నించిన తరువాత నౌకాదళం అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విమానాన్ని మోహరించినట్లు శుక్రవారం తెలిపింది.ఈ నౌకలో గురువారం సాయంత్రం ఐదు నుంచి ఆరుగురు గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు ఎక్కినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్‌లో సందేశం పంపినట్లు భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది.
The rescue operations of the hijacked vessel MV Lili Norfolk, by the Indian Navy warship INS Chennai, were seen live by the Indian Navy officials at the naval headquarters using the feed sent by the MQ-9B Predator drones of force. Soon after the piracy incident was reported last… pic.twitter.com/rzqP2ZulXm
— ANI (@ANI) January 5, 2024
దాడికి బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడుల తర్వాత ఈ ప్రాంతంలో షిప్పింగ్ గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications