కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ!

ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయిల్ అమెరికాకు సంయుక్తంగా చేస్తున్న దాడులలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సర్వ అధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చైనా ఎట్టకేలకు అమెరికా చర్యలకు వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తున్నట్టు సమాచారం.

యుద్ధంలోకి చైనా ఎంట్రీ?

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న వేళ ఇంతకాలం సంయమనం పాటించిన చైనా ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా చర్యలను వ్యతిరేకిస్తోందని వార్తలు వస్తున్నాయి. నిన్నటివరకు దాడులను ఖండించి, చర్చలకు పిలుపునిచ్చిన చైనా చేష్టలుడిగి చూసింది. అందుకు కారణం లేకపోలేదు. ముఖ్యంగా చమురు సరఫరా అనేది చైనాకు చాలా అవసరం. అది లేకుంటే చైనాలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం ఉంది.

The Iran Israel War took a crucial turn China Extends Support Calls for Halt to US Israel Strikes

చమురు సరఫరా లింక్ తో సైలెంట్ గా చూసిన చైనా

అలాంటిది ఈ యుద్ధంలో ఇరాన్ కు మద్దతు తెలిపి రిస్క్ తీసుకోవాలి అని చైనా అనుకోలేదు. యుద్ధ పరిస్థితులు చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన చమురు సరఫరా మార్గాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అందుకే ఈ సంక్షోభం బీజింగ్‌కు దూరమైనది కాకుండా..ప్రత్యక్ష ఆర్థిక ప్రభావాలను కలిగించే అంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య బీజింగ్ అధికారికంగా ఈ దాడులను ఖండిస్తూ, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.

తాజాగా ఇరాన్ కు మద్దతు ప్రకటించిన చైనా

అంతర్గతంగా ఇరాన్ కు సహకరిస్తూ వచ్చింది, కానీ బాహాటంగా తమ మద్దతును ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఈ యుద్ధ రంగంలోకి చైనా కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కీలక సమాచారం ఇస్తూ ఇరాన్ కు సహకరించిన చైనా, ఇప్పుడు ఏకంగా ఇరాన్ కు తమ మద్దతును ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చైనా హామీ

ఇరాన్ కు మద్దతుగా అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులు చేయటానికి చైనా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చైనా ఇరాన్ కు హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా తమ దాడులను తక్షణమే ఆపాలని చైనా డిమాండ్ చేసిందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+