మాజీ ప్రధాని ఫ్యామిలీలో మరో కలకలం, నిన్న మనుమడు, నేడు కొడుకు ?, కోర్ కమిటీలో !
హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియో కేసుకు సంబంధించి జేడీఎస్ పార్టీ కోర్ కమిటీ అత్యవసర సమావేశం మంగళవారం హుబ్బళిలో జరుగుతోంది. ఇప్పటికే హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణని సస్పెండ్ చేశామని ఆదేశించారు. ఇప్పుడు మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ రేవణ్ణపై కూడా చర్యలు తీసుకునేందుకు జేడీఎస్ కోర్ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ స్యాండల్ పెన్ డ్రైవ్ వ్యవహారం బయటకు రాగానే ఆయన విదేశాలకు పారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో కుమారుడు ప్రజ్వల్ కి అనుకూలంగా ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ మాట్లాడారు. ఇది నాలుగైదేళ్ల క్రితం నాటి కేసు అని, ఇప్పుడు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని, ఇది రాజకీయ కక్ష అని, తన కుమారుడు ప్రజ్వల్ ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నారని చెప్పారు.

మాజీ మంత్రి రేవణ్ణ ఉదంతం జేడీఎస్ పార్టీతో పాటు బీజేపీ కూటమిని ఇబ్బంది పెట్టిందని బీజేపీ, జేడీఎస్ పార్టీల్లో చాలా మంది నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందిని నివారించేందుకు, లోక్ సభ ఎన్నికల సమయంలో దోషులపై జేడీఎస్ పార్టీ తగిన చర్యలు తీసుకుందని ప్రచారం చేసేందుకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవాలని జేడీఎస్ నాయకులు నిర్ణయించారని తెలిసింది. ఇదే సమయంలో హాసన్ ఎంపీ ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలిసింది.
మాజీ సీఎం, జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి, జేడీఎస్ పార్టీ సీనియర్ నేత జీటీ దేవెగౌడ నేతృత్వంలో మంగళవారం జరుగుతున్న ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో కీలక చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ప్రజ్వల్ రేవణ్ణ మీద చర్యలు తీసుకోవాలని జేడీఎస్ లోని కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ప్రజ్వల్ రేవణ్ణను ఇప్పటికే పార్టీ నుంచి తొలగిస్తూ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పుడు సెక్స్ స్యాండల్ కేసు నుంచి డ్యామేజ్ కంట్రోల్ చెయ్యడానికి, హెచ్‌డీ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జేడీఎస్ నేతలతో చర్చించారని తెలిసింది. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో గురించి ముందూవెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణను పార్టీ నుండి బహిష్కరించే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్ డీ దేవేగౌడ సొంత కొడుకు, మనుమడిని పార్టీ నుంచి బహిష్కరిస్తే అదే సంచలనం అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ఇదే సమయంలో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలో రెండో దశ లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, దానిపై ప్రభావం పడకుండా నేటి సమావేశంలో జేడీఎస్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణపై తగిన చర్యలు తీసుకుంటారనే అంచనాలు ఉన్నట్టు తెలిసింది. మొత్తం మీద జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ కేసు వ్యవహారం కర్ణాటకను కుదిపేస్తోంది












Click it and Unblock the Notifications