వక్ఫ్ బిల్లుపై జేపీసీ ఏర్పాటు - తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు..!!

వక్ఫ్ బిల్లు పై సంయుక్ల పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అయింది. 21 మంది లోక్ సభ..10 మంది రాజ్యసభ సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేసారు. వక్ఫ్ బిల్లు పైన లోక్ సభలో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. మత స్వేచ్ఛకు విఘాతంగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ధ్వజమెత్తాయి. దీంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురిని ఎంపిక చేసారు.

పార్లమెంట్ లో చర్చ
1995నాటి వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సమీకృత వక్ఫ్‌ యాజమాన్య, సాధికారిక, సామర్థ్య అభివృద్ధి చట్టంగా మారుస్తున్నామంటూ కేంద్రం బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లు పైన ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్ తోపాటు ఇండియా కూటమికి చెందిన పార్టీలన్నీ ఈ బిల్లు దేశాన్ని విభజించేలా ఉందని విమర్శించాయి. ఎన్డీయే మిత్రపక్షాలు సమర్ధించాయి. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ బిల్లును రూపొందించిందని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని దుయ్యబట్టారు.

The Joint Parliamentary Committee formed to review the Waqf Amendment Bill 2024

జేపీసీ ఏర్పాటు
ముస్లిమేతరులను వక్ఫ్‌ పాలకమండలిలో సభ్యులుగా చేర్చడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. ముస్లింలపైనే కాక క్రైస్తవులు, జైనులపై దాడులు చేయడం బీజేపీ లక్ష్యమని విమర్శించారు. ఇక మైనారిటీలే తమ ఆస్తులను నిర్వహించుకునేందుకు రాజ్యాంగంలోని 30వ అధికరణ వీలు కల్పిస్తోందని, ఈ బిల్లు ఆ అధికరణకు వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న అభ్యంతరాలతో ప్రభుత్వం జేపీసీకి అంగీకారం తెలిపింది. ఇప్పుడు సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమిస్తూ సభ్యులను ఖరారు చేసారు.

కమిటీలో సభ్యులుగా
జేపీసీలో గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, టీడీపీ ఎంపీ క్రిష్ణ దేవరాయుల, మహ్మద్ జావేద్, కల్యాణ్ బెనర్జీ, జగదాంబికా పాల్, నిశికాంత్ దుబే, తేజశ్విన సూర్య, దిలీప్ సైకియా, ఏ రాజా, దిలేశ్వర్ కామత్, అర్వింద్ సావంత్, నరేశ్ మాస్కే, అరుణ్ భాథ్రి, ఎంఐంఎం అధినేత అసద్ తో పాటుగా అపరాజితా సారంగి, సంజయ్ జైశ్వాల్, అభిజిత్ గంగోపాధ్యాయ, డీకే అరుణ, మహ్మద్ జావేద్, మౌలానా మోహిబుల్లా నద్వీ, సురేష్ గోపీనాధ్ పేర్లను ప్రకటించారు. రాజ్యసభ నుంచి పదిమందిని జేపీసీలోకి ఎంపిక చేసారు. ఈ కమిటీ బిల్లు పైన అధ్యయనం చేసి పార్లమెంట్ కు నివేదిక ఇవ్వనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+