మంత్రికి మండింది, ఒక్క సంతకంతో జోబులో చేతులు పెట్టుకుని నేరుగా వెళ్లిపోయారు !
బెంగళూరు: బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లి రిపోర్టు చేయకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను 27 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ ఇంజనీర్లను సస్పెండ్ చేస్తూ కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ రూల్స్, 1957లోని రూల్ 10(1) (డి) ప్రకారం, ఈ అధికారులందరినీ తదుపరి శాఖాపరమైన విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని కర్ణాటక ఐటీ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆదేశించారు. 600 కోట్ల రూపాయల MGNREGA (NREGA) బకాయి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేయడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి ప్రియాంక్ ఖార్గే న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శితో సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద ఉపాధి హామీ పనిదినాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న13 కోట్ల నుంచి 18 కోట్లకు పెంచాలని కార్యదర్శుల దృష్టికి మంత్రి ప్రియాంక్ ఖార్గే తీసుకెళ్లారు. మంజూరైన 13 కోట్ల పనిదినాలలో 10 కోట్ల పనిదినాలు ఇప్పటికే వినియోగించబడ్డాయని, కరువు పీడిత ప్రాంతాల నివాసితుల జీవనోపాధికి అదనపు పనిదినాలు అవసరం అని, ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని, అయితే రాబోయే 2,3 నెలల్లో పరిస్థితిని అంచనా వేయలేమని, కరువు తాలూకాల్లో అత్యవసర నీటి అవసరాలకు నిధులు అవసరమని మంత్రి ప్రియాంక్ ఖార్గే అన్నారు.
కర్ణాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శితో ప్రత్యేక సమావేశం అయ్యారు.. రూ 600 కోట్ల బకాయి ఉన్న MGNREGA నిధులను విడుదల చేయాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. కరువు పరిస్థితుల దృష్ట్యా ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద పని దినాల హామీని ప్రస్తుత 13 కోట్ల నుంచి 18 కోట్లకు పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు.












Click it and Unblock the Notifications