ప్రొఫెసర్ చెయ్యి పూర్తిగా నరికేసిన పీఎఫ్ఐ లీడర్స్, కోర్టులో ఖేల్ కథం, 13 ఏళ్ల తరువాత !
కొచ్చి/తిరువనంతపురం: కేరళలో 13 ఏళ్ల క్రితం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రొఫెసర్ చేతిని నరికిన కేసులో నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థకు చెందిన ఆరుగురు కార్యకర్తలను స్థానిక ప్రత్యేక కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. నిందితులకు శిక్షా పరిమాణాన్ని కోర్టు ప్రకటించనుంది. ఈ కేసును తొలుత విచారించిన కోర్టు 10 మందిని దోషులుగా ప్రకటించింది.
అయితే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సజిల్, నాసర్, నజీబ్‌లను దోషులుగా నిర్ధారించింది. ఈ చర్యలో అతనికి సహకరించిన నౌషాద్, పీపీ మొయిద్దీన్, అయూబ్‌లను దోషులుగా ప్రకటించింది. మిగిలిన నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2010లో జోసెఫ్ తాను బోధిస్తున్న కళాశాలలోని బీకాం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్ష నిర్వహించేందుకు ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేశాడు.

ఇందులో రచయిత పి.టి.కుంజు మహ్మద్‌ను బారీ మహమ్మద్‌గా అభివర్ణించారు. ఇది ఉద్దేశపూర్వక చర్య. ఇది ఇస్లాంను అవమానించడమేనని మతోన్మాదులు మండిపడ్డారు. అదే కారణంగా, 2010 జూన్ 4వ తేదీన న్యూమాన్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ టీజే జోసఫ్ తన కుటుంబంతో చర్చిలో ప్రార్థనలు చేసి తిరిగి కారులో ఇంటికి బయలుదేరాడు. జోసెఫ్‌ను కారులో నుంచి బయటకు లాగిన దుండగులు అతని కుడి చేయిని పూర్తిగా నరికేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సవాద్ ఇంకా పరారీలో ఉండడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 54 మందిని నిందితులుగా ప్రకటించగా 37 మందిని చార్జిషీట్‌లో చేర్చారు. అనంతరం జరిగిన ఘటనపై టీజే జోసెఫ్ మాట్లాడుతూ నా చేయి నరికిన వారిపై నాకు ఎలాంటి పగ లేదు. కానీ ఈ సంఘటన వల్ల నా భార్యతో సహా మా కుటుంబం చాలా నష్టపోయింది
కానీ అది నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేయలేదు. నాపై దాడి చేసిన వారు కేవలం ఆయుధాలు పట్టుకుని రెచ్చిపోయారని, వారి మూడనమ్మకాలతో బాధితులకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఏ యుద్ధంలోనైనా విజేతలు నాలాగే ఓడిపోయినవారే. అయినా నా పోరాటం ఆగదని టీజే జోసఫ్ అన్నారు. పీఎఫ్ కార్యకర్తలు మూడనమ్మకాలతో ఓ విద్యావంతుడి జీవితం నాశనం చేయడం అప్పట్లో కేరళతో పాటు దేశవ్యాప్తంగా కళకలం రేపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications