భర్త చనిపోయిన మహిళను అర్దరాత్రి ఏం చేశారంటే, ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లి ?
బెంగళూరు/రాయచూరు: బాగా చదువుకున్న మహిళకు ఆమె కుటుంబ సభ్యులు వివాహం చేశారు. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు పిల్లలు ఉన్నారు. పిల్లలను చూసుకుంటున్న మహిళ మంచి ఉద్యోగం చేస్తోంది. ఇదే సమయంలో భర్త చనిపోవడంతో ఆమె పిల్లలను పెంచిపోషిస్తున్నది. పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మహిళను అర్దరాత్రి హత్య చేసిన నిందితులు ఆమె శవాన్ని తగలబెట్టారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగసనూరు తాలుకాలోని చిన్నద గని పట్టణం (బంగారు గని పట్టణం)లో మంజుల (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. బాగా చదవుకున్న మంజులకు కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. భర్తతో కలిసి మంజుల చిన్నదగని పట్టణంలో నివాసం ఉంటున్నది. బంగారు గని కంపెనీలో మంజుల ల్యాబ్ టెక్నీషియన్ గా మంచి ఉద్యోగం చేస్తున్నది.

మంజుల ఆమె భర్త, పిల్లలతో కలిసి చిన్నద గని కంపెనీ క్యాంపస్ లోని జీఆర్ కాలనీలోని ఇంటి నెంబర్ 45/6 ఇంటిలో నివాసం ఉంటున్నది. కొంతకాలం క్రితం మంజుల భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన తరువాత మంజుల ఆమె పిల్లలతో కలిసి ఇంటిలో నివాసం ఉంటున్నది. పిల్లలను పెంచిపోషిస్తున్న మంజుల ఉద్యోగానికి వెళ్లి వస్తున్నది.
బుధవారం సాయంత్రం ఉద్యోగం ముగించుకున్న మంజుల ఇంటికి చేరుకుంది. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసిన మంజుల తరువాత నిద్రపోయింది. గురువారం ఉదయం మంజుల ఆమె నివాసం ఉంటున్న ఇంటికి సుమారు వంద మీటర్ల దూరంలో శవమై కనిపించింది. మంజులను హత్య చేసిన నిందితులు ఆమె శరీరం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి శవాన్ని కాల్చి బూడిద చెయ్యడానికి ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న మంజుల ఎలా బయటకు వచ్చింది అని తెలియడం లేదు. గురువారం వేకువ జామున 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మంజులను హత్య చేసి శవాన్ని బయటకు తీసుకు వచ్చి కాల్చి బూడిద చెయ్యడానికి ప్రయత్నించి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

మంజుల హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, అక్రమ సంబంధం కారణంగా, ఆర్థికలావాదేవీల కారణంగా ఏమైనా హత్య జరిగిందా ? అని ఆరా తీస్తున్నామని రాయచూరు జిల్లా పోలీసులు తెలిపారు. మంజుల నివాసం ఉంటున్న కంపెనీ క్యాంపస్ లోని క్వాటర్స్ సమీపంలోనే హత్య జరగడంతో ఆమెకు బాగా పరిచయం ఉన్న వాళ్లే పక్కాప్లాన్ తో హత్య చేసి ఉంటారని సాటి ఉద్యోగులు, స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications