మహిళను ఇలా హత్య చేస్తారా, ముక్కలు ముక్కలు చేసి ఎలా విసిరేశారంటే ?. మ్యాటర్ !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు మరువక ముందే మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. యమునా ఖాదర్ ప్రాంతంలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో ఛిద్రమైన శరీర భాగాలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. మృత దేహం ఛిద్రం కాగా, మృతదేహంలో కొన్ని భాగాలు మాత్రమే లభ్యమైనాయని పోలీసులు తెలిపారు.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం !
మృత దేహం పురుషుడా లేక మహిళదే అని ప్రాథమికంగా మొదట తెలీలేదు. చివరికి ఆ శవం ముక్కలు మహిళదేనని తేలింది.

ఈ విషయమై తొలుత సమాచారం అందడంతో నార్త్ డీసీపీ సాగర్ సింగ్ కల్సి మాట్లాడుతూ ప్రాథమికంగా ఇది దాదాపు 35 నుంచి 40 ఏళ్ల మహిళ మృతదేహమని ప్రాథమికంగా తెలిసింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, క్రైమ్ టీమ్ ఘటనా స్థలంలో పరిశీలించి వివరాలు సేకరించాయి.
దీనికి సంబంధించి కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేయబడింది మరియు మృతదేహం పూర్వాపరాలను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహం మగదా లేదా ఆడదా అని ఫోరెన్సిక్స్ అధికారులు ఆరా తీస్తున్నారని, ఆ ప్రాంతంలో ఇతరుల మిస్సింగ్ కేసులు పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం !

సెంట్రల్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమాదిత్య బుధవారం మాట్లాడుతూ మాకు రెండు ప్రాంతాల నుంచి సమాచారం వచ్చిందని, ఓ నల్లటి పాలిథిన్ కవర్లు ఉన్నాయని, ఒక కవర్‌లో శరీరం యొక్క తల ఉందని, మరొకటి శరీర భాగాలను కలిగి ఉన్నాయని, ప్రాథమిక విచారణలో పొడవాటి వెంట్రుకలు కనిపించాయని, శరీరం కుళ్లిపోయి ఉండడంతో ఆ వెంట్రుకలు ఎవరివి అని గుర్తించలేకపోయామని అన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామని, హత్యకు గురైనది ఎవరు అని ఇంకా తెలీలేదని, కవర్లలో ఎన్ని శరీర భాగాలు కనిపించాయో, ఏవైనా శరీర భాగాలు కనిపించకుండా పోయాయో పోలీసులకు ఖచ్చితంగా తెలియదని ఆయన అన్నారు. మృతి చెందిన మహిళను పోలీసులు ఇంకా గుర్తించలేదని, విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications