కూతుర్లకు పెళ్లి చేసింది, ఒంటరిగా ఉంటున్న ఇంటి ఓనర్ ఆంటీని ఏం చేశారంటే ?
బెంగళూరు: బెంగళూరులో ఇటీవల ఒంటరి వృద్ధురాలి హత్య కేసు మరువక ముందే బెంగళూరు నగర శివార్లలోని కోటీశ్వరుల నివాసం ఉండే ఏరియా సమీపంలో మరో ఒంటరి మహిళ చేతులు, కాళ్లు నరికి దారుణంగా హత్య చేశారు. మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని వసిరిరేసి చాకచక్యంగా హంతకులు తప్పించుకుని పరారయ్యారు.
ఈ ఘటన బెంగళూరు నగర శివార్లలోని అనేకల్ తాలూకా బన్నేరఘట్టలోని జనతా కాలనీలో జరిగింది. బన్నేరఘట్ట జనతా కాలనీలో నివాసం ఉంటున్న గీతమ్మ (53) అనే ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసిన గీతమ్మకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు అయ్యాయని పోలీసులు అంటున్నారు.

గీతమ్మ భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉండేదని, అందులో ఒక ఇంటిలో గీతమ్మ నివాసం ఉంటున్నది, మిగిలిన రెండు ఇండ్లను గీతమ్మ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే బీహార్‌కు చెందిన యువకులకు అద్దెకు ఇచ్చింది. కొంతకాలంగా గీతమ్మ ఇంట్లో గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే యువకులు నివాసం ఉంటున్నారని తెలిసింది.
ఒంటరిగా జీవనం సాగిస్తున్న గీతమ్మ మూడు నాలుగు రోజుల క్రితం హఠాత్తుగా అదృశ్యం అయ్యింది. గత మూడు, నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన గీతమ్మ మృతదేహం చేతులు, కాళ్లు తెగిపోయిన స్థితిలో బన్నేరుఘట్ట సమీపంలో లభ్యమైంది. కొందరు దుండగులు గీతమ్మ చేతులు, కాళ్లు నరికి చంపేశారని, ఆమెను నగ్నంగా చేసి ఆమె శవాన్ని మూటలో పెట్టి పరారయ్యారని పోలీసులు అంటున్నారు.

మహిళ కనిపించకుండా పోయిన రోజు నుంచి అద్దె ఇంట్లో ఉంటున్న బీహార్‌కు చెందిన ఓ యువకుడు కనిపించకుండా పోవడంతో పాటు అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉందని పోలీసులు అంటున్నారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, గీతమ్మను ఎవరు చంపారు, ఏ కారణంతో ఆమెను హత్య చేశారన్నది విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.
మృతురాలు గీతమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్న బీహార్‌కు చెందిన యువకుడే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణంగా, ఒంటరి మహిళపై జరిగిన పాశవిక హత్య పోలీసులకు సవాల్‌గా మారింది. ఒంటరి మహిళ దారుణ హత్యకు కారణం అక్రమ సంబంధమా, లేక ఆర్థిక లావాదేవీలా, నగల కోసం హత్య చేశారా అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications