ఆంటీతో అక్రమ సంబంధం, మేడమ్ సొంత ఇంటి మీద కన్ను, ముక్కలుగా నరికేసి !

బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా అనే యువతిని ఆమె ప్రేమికుడు ఎలా ముక్కలు ముక్కలుగా నరికి చంపాడో అలేగా ఐటీ హబ్ బెంగళూరులో కూడా ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపింది. బెంగళూరు సమీపంలోనే ఈ హత్య జరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. అద్దెకు ఉంటున్న ఓ యువకుడు అతని స్నేహితులతో కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంటి యజమాని ఆంటీని హతమార్చి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారని పోలీసులు గుర్తించారు.

ప్రియురాలిని 20 ముక్కలుగా నరికేశాడు, నాకు కూతురు లాంటిదని డ్రామాలు, హెచ్ఐవీ !

https://telugu.oneindia.com/news/india/boyfriend-manoj-who-hacked-girlfriend-into-20-pieces-in-mumbai-told-police-he-was-hiv-positive-345823.html

బెంగళూరు దక్షిణ తాలూకా బన్నెరఘట్ట సమీపంలోని జనతా కాలనీలో నివాసం ఉంటున్న గీతమ్మ(54) అనే మహిళ ఇటీవల దారుణ హత్యకు గురైందని పోలీసు అధికారులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ నిందితుడిని బీహార్‌లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గీతమ్మ హత్య కేసులోని ప్రధాన హంతకుడు తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరికొందరిని అరెస్టు చేసే ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు రూరల్ ఎస్పీ బాలదండి విలేకరుల సమావేశంలో తెలిపారు.

The killers who killed a woman in Bengaluru and chopped her body into pieces escaped to Bihar.

జనతా కాలనీలో గీతమ్మకు నాలుగు ఇళ్లు ఉన్నాయి. ఒకదానిలో గీతమ్మ నివసిస్తున్నారు. గీతమ్మ ఆమె మూడు ఇళ్లను అద్దెకు ఇచ్చారు. బీహార్‌కు చెందిన పంకజ్, ఇందర్ కుమార్ తదితరులు గీతమ్మ ఇంటిని ఏడేళ్లుగా అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. గీతమ్మ ఆమె కుమార్తెలకు పెళ్లి చేసి అత్తారింటింకి పంపించేసింది. గీతమ్మ భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు.

ఇదే సమయంలో గీతమ్మతో బీహార్ కు చెందిన పంకజ్ కుమార్ చనువు పెంచుకున్నాడు. ఒంటరిగా ఉంటున్న గీతమ్మకు ఆమె ఇంటికి అవసరం అయిన సరుకులు, ఏం కావాలన్నా తెచ్చిస్తున్న పంకజ్ ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఆంటీతో రొమాన్స్ చేస్తూ ఆమె గురించి పిన్ టూ పిన్ తెలుసుకున్నాడు. తాను నివసిస్తున్న ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని గీతమ్మను ఆమె ప్రియుడు పంకజ్ కోరాడు.

సొంత ఇంటిని ప్రియుడు పంకజ్ పేరుతో రాసివ్వడానికి గీతమ్మ అంగీకరించలేదు. తర్వాత పంకజ్ అతని స్నేహితులతో కలిసి గీతమ్మ ఆంటీని చంపేయాలని డిసైడ్ అయ్యారు. స్నేహితులను పిలిపించుకున్న పంకజ్ గీతమ్మ ఆంటీని హత్య చేశారు. తరువాత గీతమ్మ ఇంటిలోనే ఆమె శరీరాన్ని రంపంతో చేతులు, కాళ్లు, కాళ్లు, మొండెం కోసేశారు.

The killers who killed a woman in Bengaluru and chopped her body into pieces escaped to Bihar.

అనంతరం గీతమ్మ ఆంటీ మృతదేహంలోని విడిభాగాలను వేర్వేరు చోట్ల విసిరిన నిందితులు బీహార్‌కు పరారైనారు. కొద్ది రోజుల క్రితం జనతా కాలనీలోని పొద దగ్గర ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహిళ మొండెం మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అయితే పరిసర ప్రాంతాల్లో మహిళ శరీరభాగాల కోసం వెతికినా కూడా ఆమె శరీర భాగాలు ఎక్కడా చిక్కకపోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.

డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అయినా మహిళ శరీరా భాగాలు చిక్కకపోవడంతో పోలీసులు హడలిపోయారు. చివరికి గీతమ్మ మొబైల్‌ నెట్‌వర్క్‌తో సహా పలు కోణాల్లో పోలీసులు విచారణ చేశారు. ఇంతలో గీతమ్మ ఆంటీ ఇంటిలో అద్దెకు ఉన్న బీహార్ యువకులు కనిపించకుండా పోవడంతో వారి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.

వెంటనే పోలీసులు బీహార్‌లో హంతకులకు వెతకడం ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన ఇన్‌స్పెక్టర్ ఉమా మహేష్ బృందంపై హంతకులు రాళ్లు రువ్వి పరారయ్యారు. చివరకు ఎదురుదాడికి దిగిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇందర్ కుమార్‌ను అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. గీతమ్మను హత్య చేసి ఆమె చేతులు, కాళ్లు విసిరేసిన ప్రదేశాన్ని చూపించారు. మృతదేహం కుళ్లిపోవడంతో పొదల దగ్గర పడేసి పారిపోయారని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+