Dancer: సినిమాల్లో డ్యాన్స్ లు, పోలీసుల మీద ? మీనా మేడమ్ ఆల్కాహాల్ లెవల్ ఎంతంటే ?
చెన్నై: మద్యం మత్తులో ఓ మహిళ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్దరాత్రి ద్విచక్ర వాహనంపై ప్రియుడితో వెళ్లిన ఓ మహిళ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల మీద చిందులు వేసింది. నేను రోజు తాగి ఇంటికి వెలుతున్నా, ఇన్ని రోజులు లేని సమస్య మీకు ఈరోజే ఎందుకు వచ్చింది, నన్ను ఎందుకు అడ్డుకున్నారు అంటూ ఆ లేడీ ట్రాఫిక్ పోలీసుల మీద చిందులు వేసింది. ట్రాఫిక్ పోలీసుల ముందు చిందులు వేసిన చిన్నది నిజంగా సినిమాల్లో డ్యాన్సర్ గా పని చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

చెన్నై చిన్నది
న్యూఇయర్ సందర్బంగా చెన్నై సిటీలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సోదాలు చేశారు. ఆ సమయంలో చెన్నైలోని సైదాపేట తాదండర్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులకు ఓ బైక్ లో వెలుతున్న జంట కంటపడ్డారు. తరువాత ఇద్దరిని పక్కకు నిలిపిన పోలీసులు వారు మద్యం సేవించారా అని పరిశీలించారు,

నేను రోజు తాగి ఇంటికి పోతున్నా.... తెలుసా ?
ఆ సమయంలో బైక్ లో ప్రియుడి వెనుక కుర్చున్న మహిళ నేను రోజూ మద్యం సేవించి ఇదే రోడ్డు మీద వెలుతున్నాను, ఇన్ని రోజులు నన్ను ఎవ్వరూ అడ్డుకోలేదు., ఈ రోజు నన్ను పట్టుకోలేదని, ఈరోజు ఎందుకు పట్టుకున్నారో చెప్పండి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ నడిరోడ్డు మీద ఊగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు మీద యువతి చిందులు వేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అవుతోంది.

మేడమ్ పేరు మీనా
చెన్నై ట్రాఫిక్ పోలీసులు మీద చిందులు వేసిన మహిళ వేలచ్చేరికి చెందిన మీనా అని తేలింది. గత 31వ తేదీ రాత్రి విరుకంబాక్కంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు హాజరైన మీనా ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్ లో వెలచ్చేరికి వెళ్తుండగా సైదపేట్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలో ఇద్దరు పట్టుబడ్డారని పోలీసు అధికారులు అంటున్నారు.

లైసెన్స్ లేదు. పైగా మద్యం సేవించారు
మేడమ్ మీనా బాయ్ ఫ్రెండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మద్యం సేవించి వాహనం నడిపినందుకు రూ.10వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు రూ. 5వేలు జరిమానా విధించి ద్విచక్ర వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అపరాదరుసుం చెల్లించి బైక్ తీసుకుని వెళ్లాలని మీనా బాయ్ ఫ్రెండ్ కు పోలీసులు సూచించారు.

చిందులు వేసిన చిన్నది సినిమా డ్యాన్సర్
ఇప్పటి వరకు జరిమానా చెల్లించకపోవడంతో ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన యువతి మీనా తమిళ సినిమాలో డ్యాన్సర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే సినీ డ్యాన్సర్ మీనాకు ట్రాఫిక్ పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ చేయగా ఆమె ఆల్కహాల్ లెవల్ 189 ఉందని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications