సొంత పార్టీ లీడర్ తో ఏకాంతంగా ఉన్న ఫోటోలు వైరల్, లేడీ లీడర్ ఆత్మహత్య, ఏ పార్టీ ?
బెంగళూరు: అస్సాం బీజేపీ నాయకురాలు ఇంద్రాణి తహబిల్దార్ గౌహతిలోని తన నివాసంలో శుక్రవారం శవమై కనిపించారు. పార్టీలో కిసాన్ మోర్చా కార్యదర్శిగా పనిచేసిన 48 ఏళ్ల నాయకురాలు ఇంద్రాణి, సీనియర్ బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
బీజేపీ సీనియర్ నేతతో ఇంద్రాణి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంద్రాణి తహబీల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ మూమెంట్స్ తో ఇంద్రాణి ఉన్న ఫోటోలు బయటపెట్టడంతో మనస్తాపానికి గురైన బీజేపీ నాయకురాలు ఆత్మహత్య చేసుకోవడం అస్సోంలో కలకలం రేపింది.

గోలాఘాట్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేతతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 11వ తేదీ శుక్రవారం ఇంట్లో ఇంద్రాణి డ్రగ్స్ ఓవర్ డోస్ చేసించి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. రాసలీలు సాగించిన బీజేపీ నాయకుడి ఇంటిలోనే బీజేనీ నాయకురాలు ఇంద్రాణి తహబీల్దార్ అద్దెకు ఉందని సమాచారం.

ఇంద్రాణి ఆత్మహత్మ అస్సాం బీజేపీ నాయకులను కలిచివేసింది. పార్టీలో సుప్రసిద్ధమైన మరియు ప్రభావవంతమైన ఉనికిని ఏర్పరుచుకుంటున్న ఇంద్రాణి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ గా, కిసాన్ మోర్చా కోశాధికారి వంటి కీలకమైన పదవులు నిర్వహించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వైరల్ ఫోటోలలో చిత్రీకరించబడిన బీజేపీ నాయకుడితో ఆమెకు దగ్గరి సంబంధం ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. అలాగే ఇంద్రాణి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశామని, సంఘటనకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ దురదృష్టకర పరిణామానికి దారితీసిన ప్రైవేట్ చిత్రాలను లీక్ చేసిన వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు చురుకుగా పనిచేస్తున్నారని తెలిసింది.

దర్యాప్తు ప్రారంభించడంతో, స్థానిక అధికారులు ఫోటోలో ఉన్న బీజేపీ నాయకుడి కోసం వెతుకుతున్నామని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఇంద్రాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పంపించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇంద్రాణి ఓవ్యక్తితో ఉన్న అసభ్య ఫోటోలు లీక్ అయినట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గౌహతి డీసీపీ దీపక్ చౌదరి తెలిపారు. అనుమానాస్పద కేసును స్వీకరించి విచారణ జరుపుతున్నట్లు డీసీపీ దీపక్ చౌదరి తెలిపారు.












Click it and Unblock the Notifications