అక్రమ సంబంధం, వ్యాపారవేత్తను పాములతో చంపించిన కిలాడీ ఆంటీ, మ్యాటర్ లీక్ !
డెహ్రాడూన్/లక్నో: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పోలీసులు 30 ఏళ్ల వ్యాపారవేత్తను చంపడానికి నాగుపామును ఉపయోగించిన కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. హత్య ప్రమాదవశాత్తు జరిగిందని యాక్సిడెంట్‌గా జరిగిందని క్రియేట్ చెయ్యడానికి ఐదు మంది ప్రయత్నించారని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన హవాడిగ రమేష్‌నాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిగిలిన నలుగురు నిందితుల్లో ఒకరైన వ్యాపారవేత్త ప్రియురాలు మహిమ అలియాస్ డాలీ ఆర్యా కూడా అరెస్టు అయ్యింది. హత్యకు గురైన వ్యాపారవేత్తతో డాలీ ఆర్యాకు అక్రమ సంబంధం ఉందని పోలీసులు అన్నారు. డాలీ ఆర్యా బాయ్ ఫ్రెండ్ దీప్ కంద్‌పాల్, మహిళ ఇంటి పనిమనిషి అరెస్టు అయ్యారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారు.

నైనిటాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ భట్ మాట్లాడుతూ 30 ఏళ్ల వ్యక్తి అతని కారులో టిన్‌పానీ ప్రాంతానికి సమీపంలో రోడ్డు పక్కన చనిపోయి శవమై కనిపించాడని ఆయన తెలిపారు. జూలై 15న వ్యాపారవేత్త అంకిత్ చౌహాన్ తన కారులో నిర్జీవంగా శవమై కనిపించాడని, స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసుల వెళ్లి పరిశీలించారని ఆయన చెప్పారు.
పోలీసులు వ్యాపారవేత్త అంకిత్ చౌహాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము విషం కాటు వల్లే వ్యాపారి అంకిత్ చౌహాన్ మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీని తర్వాత మృతుడు అంకిత్ ఫోన్ కాల్ వివరాలను తనిఖీ చేయగా అతను డాలీ ఆర్యా అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడని. అతను చనిపోయే ముందు ఆమెతో చాలాసార్లు మాట్లాడడని పోలీసులు కనుగొన్నారు.

మేము డాలీ ఆర్యా అనే మహిళ ఫోన్ కాల్ రికార్డులను ట్రాక్ చేసామని, అక్కడ ఉత్తరప్రదేశ్ కు చెందిన పాములు పట్టే రమేష్ నాథ్‌తో ఆమె చాలాసార్లు మాట్లాడిందని పోలీసులు అన్నారు. పాములు పట్టే రమేష్ నాథ్ ఫోన్ నంబర్‌పై పోలీసులు దృష్టి పెట్టారు. దీని తర్వాత సోమవారం ఉత్తరప్రదేశ్‌లో పాములు పట్టే రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల విచారణ సమయంలో డాలీ ఆర్యా అనే మహిళ తన స్నేహితుడు దీప్ కాన్పాల్ మరియు ఆమె ఇంటి పనిమనిషి చౌహాన్‌ను నాగుపామును విడిచిపెట్టి చంపడానికి కుట్ర పన్నారని వెల్లడించింది అని సీనియర్ పోలీసు అధికారి బుధవారం స్థానిక మీడియాకు తెలిపారు. ఇదే సమయంలో వ్యాపారి అంకిత్ ను హత్య చెయ్యడానికి నిందితులు వేసిన స్కెచ్ వివరాలు పోలీసులకు చెప్పారు.

వ్యాపారి అంకిత్ కు అతని ప్రియురాలు డాలీ ఆర్యా మద్యంలో మత్తుపదార్థాన్ని కలిపి ఇచ్చింది. వ్యాపారి అంకిత్ స్పృహతప్పి పడిపోయినప్పుడు అతనిపై నాగుపామున వదిలిందని, పాము కాటు వలన అతను చనిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వ్యాపారి అంకిత్ చౌహాన్ సోదరి ఇషా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిలాడీ లేడీ డాలీ ఆర్యా, ఆమె ప్రియుడు దీప్ కాన్పాల్ తన సోదరుడిని చంపేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
అంకిత్ సోదరి ఫిర్యాదు ఆధారంగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. హల్ద్వానీ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అక్రమ సంబంధం కారణంగా వ్యాపారి దగ్గర డబ్బులు లాక్కొన్న తరువాత అతని పీడ వదిలించుకోవాలని కిలాడీ లేడీ డాలీ ఆర్యా ఆమె బాయ్ ఫ్రెండ్ తదితరులతో కలిసి వ్యాపారి అంకిత్ ను పక్కా ప్లాన్ తో చంపేసిందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications