IT hub: టెక్నాలజీ ఏమో కాని, కింద మాత్రం తడిచిపోయింది
ఐటీ హబ్ రాజధాని బెంగళూరు నగరంతో వరుణ దేవుడు ఆగ్రహించాడు. బెంగళూరు నగరంలో విపరీతమైన వర్షం పడటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాల దెబ్బకు ఐటీహబ్ ప్రజలు బిత్తరపోయారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోయారు.
బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం నీరు, న్రధాన కాలువల నీరు రోడ్ల మీదకు రావడంతో ప్రజలు నానా తిప్పలుపడ్డారు. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన వానలు పడటంతో ఆ ప్రాంతంలోని కొన్ని విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారి పిల్లలను సురక్షితంగా ముందుగానే ఇంటికి పంపించేశారు.

బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు. బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అత్యవసరంగా సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీబీఎంపీ పరిధిలో అధికారులు నిర్లక్షంగా విధులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ సంబంధిత అధికారులను హెచ్చరించారు.

బెంగళూరు అంటేనే ట్రాఫిక్ సమస్య అని దేశవ్యాప్తంగా చెడ్డపేరు మూటకట్టుకుంది. ఇక వర్షాలు వచ్చాయంటే బెంగళూరు ప్రజల ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. భారీ వర్షాల దెబ్బకు బెంగళూరు నమ్మ మెట్రో రైలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆ ప్రాంతంలో బయట కాలు పెట్టాలంటే ప్రజలు హడలిపోతున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు సైతం వర్షం నీటి దెబ్బకు హడలిపోతున్నారు. ప్రధాన కాలువలు నిండిపోయి డ్రైనేజ్ నీరు బయటకు వస్తోంది.












Click it and Unblock the Notifications