రూ.కోటి లంచం, ఎస్ఐటి కస్టడీకి నిందితులు
బెంగళూరు: లోకాయుక్త రూ.కోటి లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ నివాసి అశ్విన్ రావ్, అతని అనుచరుడు భాస్కర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు (ఎస్ఐటి) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్, అతని అనుచరుడు భాస్కర్ ను లోకాయుక్త న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా వీరిని విచారించడానికి కస్టడికి ఇవ్వాలని దర్యాప్తు చేస్తున్న అధికారులు కోర్టులో మనవి చేశారు.

కేసు వివరాలు తెలుసుకున్న లోకాయుక్త న్యాయస్థానం ఇద్దరిని ఎస్ఐటి అధికారుల కస్టడికి అప్పగించారు. ఈనెల 17వ తేది వరకు భాస్కర్ ను కస్టడిలోకి తీసుకుని విచారించడానికి లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ఈ నెల 7వ తేదిన సాయంత్రంలోపు అశ్విన్ రావ్ ను కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి సూచించారు. బెంగళూరు నగర జిల్లా గ్రామ పంచాయితీ లో సీనియర్ ఇంజనీరుగా పని చేస్తున్నకృష్ణమూర్తిని రూ. కోటి లంచం ఇవ్వాలని, అదే విధంగా హావేరికి చెందిన ఇంజనీరు చెన్నబసప్పను లంచం ఇవ్వాలని బెదిరించడంతో వీరిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications