రూ. కోటి లంచం, సిట్ కస్టడికి తెలంగాణ వాసి

బెంగళూరు: లోకాయుక్త లంచం కేసులో అరెస్టు అయిన నిందితులను శుక్రవారం లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించాలని, అశోక్ కుమార్ అనే వ్యక్తిని కస్టడికి తీసుకోవాలని ఎస్ఐటి అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ప్రధాన అనుచరుడు అశోక్ కుమార్ ను ఎస్ఐటి అధికారులు కస్టడిలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

The Lokayukta Special Court sent Ashok Kumar to SIT custody

తెలంగాణలోని వరంగల్ కు చెందిన అశోక్ కుమార్ హైదరాబాద్ తో సహ తెలంగాణ, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. లోకాయుక్త రూ. కోటి లంచం డిమాండ్ చేసిందనే కేసులో అశ్విన్ రావ్, అశోక్ కుమార్,శంకర్ గౌడ, శ్రీనివాస్ గౌడలను ఎస్ఐటి అధికారులు అరెస్టు చేశారు.

శుక్రవారం అశోక్ కుమార్, శ్రీనివాస్ గౌడ, శంకర్ గౌడలను కోర్టు ముందు హాజరు పరిచారు. అశోక్ కుమార్ ను విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్దన్ మనవి చేశారు. న్యాయమూర్తి వీ.జి. బోప్పయ్య అందుకు అనుమతి ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ, శంకర్ గౌడలను సెంట్రల్ జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+