మైనస్ 250 డిగ్రీల చలి: ఇస్రో ముందు పెను సవాల్ అదే..!!

బెంగళూరు: ఇంకొక్క రోజు. చందమామపై సూర్యోదయం కాబోతోంది. చంద్రుడిపై సూర్యకిరణాలు ప్రసరించబోతోన్నాయి. 14 రోజుల పాటు అక్కడ అలముకుని ఉన్న గాఢాంధకారం తొలగిపోనుందక్కడ. ఈ సమయం కోసం ఎదురు చూస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా? అనే ఉత్కంఠతతో గడుపుతోంది.

దీనికి కారణం.. మిషన్ చంద్రయాన్ 3. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై వాలిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. ప్రస్తుతం నిద్రావస్థలో ఉన్న ఈ రెండూ కూడా మేల్కొంటే గానీ.. చంద్రుడిపై మళ్లీ పరిశోధనలు సాధ్యం కావు. ఇవి శాశ్వత నిద్రలోకి వెళ్తాయా? లేక.. పునరుజ్జీవం పొందుతాయా? అనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది.

The Lunar Alarm Clock: Chandrayaan-3s Lander and Rover Prepare to Rise as ISRO scientistsputefforts

చంద్రుడిపై ఇస్రో చేపట్టిన పరిశోధనల తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైన తరువాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. నిద్రలోకి జారుకున్నాయి. అక్కడ ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం. ఈ నెల 22వ తేదీన రాత్రి సమయం ముగియనుంది. పగలు ఆరంభం కానుంది. ఇంకో 14 రోజుల పాటు పగటి సమయం ఉంటుందక్కడ.

సూర్య కిరణాలకు విక్రమ్ ల్యాండర్, రోవర్‌లో అమర్చిన బ్యాటరీలు రీఛార్జ్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు బ్యాటరీలు కూడా సౌర విద్యుత్ ఆధారంగా పని చేసేవే కావడం దీనికి కారణం. రాత్రి సమయం కావడం వల్ల ప్రస్తుతం బ్యాటరీలు డెడ్ అయ్యాయి. అవి రీఛార్జ్ కావాలీ అంటే సౌర విద్యుత్ అవసరం.

పగటి సమయం మొదలు కాబోతోన్నందున సూర్యుడి వెలుగును గ్రహించడం వల్ల బ్యాటరీలు మళ్లీ రీఛార్జ్ అవుతాయని ఇస్రో ఆశిస్తోంది. అవి రీఛార్జ్ అయితేనే రోవర్ మళ్లీ యాక్టివేట్ కాగలుగుతుంది. అదే జరిగితే- ఇంకో 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించడానికి వీలు ఉంటుంది.

The Lunar Alarm Clock: Chandrayaan-3s Lander and Rover Prepare to Rise as ISRO scientistsputefforts

విక్రమ్ ల్యాండర్‌లో పేలోడ్స్‌గా పంపించిన చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ ప్రస్తుతం టర్న్ ఆఫ్ మోడ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రోవర్‌కు అమర్చిన రిసీవర్ మాత్రమే స్విచాన్‌లో ఉంది. అది చీకటి రాత్రుల్లో కూడా కూడా పని చేయగలుగుతుంది.

చంద్రయాన్-3 మిషన్‌ మళ్లీ ఎప్పట్లాగే పని చేయగలుగుతుందని ఆస్ట్రానమర్, ప్రొఫెసర్ డాక్టర్ ఆర్‌సి కపూర్ అన్నారు. రోవర్, ల్యాండర్ ఇప్పటికే తమ పనిని ముగించుకున్నాయని, రాత్రి సమయం ఆరంభం అయ్యే సమయం వరకూ వాటిల్లోఅమర్చిన పేలోడ్స్ సజావుగా పనిచేశాయని అన్నారు. రాత్రి సమయం ముగిసిన తరువాత కూడా పేలోడ్స్ అన్నీ జీవం పోసుకుంటాయనే కొంత ఆశ ఉందని అన్నారు.

చంద్రుడి దక్షిణ ధృవంపై మైనస్ 250 డిగ్రీల చలి నమోదవుతుంటుందని, దీన్ని తట్టుకునే సామర్థ్యం చంద్రయాన్ 3 పేలోడ్స్‌కు లేవని ఇస్రో శాస్త్రవేత్త సువేందు పట్నాయక్ అన్నారు. 14 రోజుల గడ్డ కట్టించే చలి ప్రభావం వల్ల కొన్ని ఎలక్ట్రానిక్ భాగాలు పనిచేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు.

రాత్రి సమయం ముగిసిన తరువాత పేలోడ్స్ రీయాక్టివేట్ అవుతాయని ఆశించట్లేదని ఆయన అన్నారు. మళ్లీ పని చేయడం మొదలు పెడితే అది తమకు ఓ అనుకోని వరం అవుతుందని, చంద్రుడి మీద మరిన్ని ప్రయోగాలు సాగించడానికి అసలు సిసలు అవకాశాలు లభించినట్టవుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+