మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఆస్తిపై తల్లికి హక్కు లేదు
తాజాగా మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎటువంటి హక్కులేదంటూ మద్రాసు హైకోర్టు తీర్పుఇచ్చింది. అతడి ఆస్తిపై కేవలం అతని భార్య, పిల్లలకి మాత్రమే సర్వహక్కులు ఉంటాయని, తల్లికి ఎలాంటి హక్కు ఉండదని కోర్టు పేర్కొంది. మేరీ అనే ఓ తల్లి 2012లో మరణించిన తన కుమారుడి ఆస్తిలో వాటా కావాలంటూ ఓ పిటిషన్ దాఖలు వేసింది. ఆ పిటిషన్‌కు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తన తీర్పును వెల్లడించింది.
మరణించి కుమారుడి ఆస్తిలో వాటా కోసం కోర్టుకెక్కిన తల్లి : మేరీ తమిళనాడులోని నాగపట్టణంకు చెందినది. ఈమె అసలు పేరు పౌలిన్ ఇరుదయ మేరీ. ఈమెకు మోసెస్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. అతడికి 2004లో ఆగ్నస్ అనే మహిళతో పెళ్లి అయ్యింది. వాళ్లకి ఓ కూతురు కూడా ఉంది. అయితే, 2012 లో ఆకస్మాత్తుగా మోసెస్ మరణించాడు. మోసెస్ మరణం అనంతరం అతడి తల్లియిన మేరి కొడుకు ఆస్తిలో వాటా కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. అయితే నాగపట్టణం కోర్టు తీర్పు మేరికి అనుకూలంగా వచ్చింది. మోసెస్ ఆస్తిలో తన తల్లికి సైతం వాటా ఉంటుందంటూ జిల్లా కోర్టు తీర్పునివ్వడం జరిగింది.

సంచలన తీర్పు ప్రకటించిన మద్రాసు కోర్టు : అయితే, మోసెస్ భార్య ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ సుబ్రమణియన్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్‌లు పీఎస్ మిత్రా నేశా సహాయాన్ని కోరింది. అయితే, ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై సంచలన తీర్పును ప్రకటించింది. "వారసత్వ చట్టం సెక్షన్ 42 ప్రకారం, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న భర్త మరణిస్తే భార్య, పిల్లలు మాత్రమే అతని ఆస్తికి హక్కుదారులవుతారని వెల్లడించింది.
అంతేకాకుండా, మరణించిన వ్యక్తికి భార్యాపిల్లలు లేని పక్షాన ఆ ఆస్తి తండ్రికి దక్కుంతుందని, ఒకవేళ తండ్రి లేకపోతే ఆవ్యక్తి తల్లి, సోదరులు, సోదరిమణులకు మాత్రమే ఆస్తిపై హక్కు ఉంటుంది" అని కోర్టుకు న్యాయవాది తెలిపారు. ఆ లాయర్ వ్యాఖ్యలతో న్యాయస్థానం ఏకీభవించి, జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపడేసింది. మోసెస్‌కు సంబంధించిన ఆస్తిపై అతడి తల్లికి ఎలాంటి హక్కు ఉండదని తెలిపింది. మరణించిన మోసెస్ ఆస్తిపై అతడి భార్య ఆగ్నస్, కూతురికి మాత్రమే హక్కు ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొంది.












Click it and Unblock the Notifications