కర్ణాటక కడుపు కొట్టి తమాషా చూస్తున్న తమిళనాడు, పుట్టింది ఇక్కడ, పొర్లుతోంది ఎక్కడంటే ?
వర్షాల లేని కారణంగా కన్నడిగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం కన్నడిగులు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కర్ణాటకలో ఎక్కడా చుక్క వర్షం కురవలేదు. అందుకే కన్నడిగులు ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా కాపాడుకుంటూ పొదుపుగా నీరు తాగుతున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం కావేరీ నదిపై నిర్మించిన డ్యామ్ పొంగిపొర్లుతోంది.
కర్ణాటకలో చాలా కాలంగా వర్షాలు లేవు, వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రైతుల నోటి నుంచి వినిపిస్తున్న బాధాకరమైన మాట ఇది. గత ఆరు ఏళ్లుగా కన్నడిగులను కరుణించని వరుణదేవుడు 2023లో మాత్రం కొంచెం కనికరించాడు. దీంతో వేసవి ప్రారంభంలోనే కావేరీ నది ఎండిపోతోంది. అయితే తమిళనాడులో మాత్రం కావేరీ నదికి అడ్డంగా నిర్మించిన డ్యామ్ మాత్రం పొంగిపొర్లుతోంది.

తమిళనాడులో అతిపెద్ద డ్యామ్, చాలా ముఖ్యమైన రిజర్వాయర్‌గా పేరుగాంచిన మెట్టూరు డ్యామ్‌లో పుష్కలంగా నీరు ఉంది. కొంతకాలం క్రితం 30 అడుగుల మేర పడిపోయిన మెట్టూరు డాంకు ఏడాది చివర్లో భారీ స్థాయిలో నీరు వచ్చి చేరింది. దీంతో మెట్టూరు డ్యాం ఖాళీ అవుతుందన్న భయం తమిళనాడు ప్రజల్లో తొలగిపోయింది. మెట్టూరు డ్యాం వేగంగా నిండుతోంది. వేసవిలో కూడా ఇప్పుడు ఈ మెట్టూరు జలాశయంలో 63.36 అడుగుల నీరు ఉంది. 120 అడుగుల ఎత్తు ఉన్న మెట్టూరు డ్యాంలో 63. 36 అడుగుల నీరు నిల్వ ఉంది. 1,000 క్యూసెక్కుల నీటిని చుట్టుపక్కల రైతుల కోసం విడుదల చేస్తున్నారు.
కర్ణాటక నీటిలో తమిళనాడు వాటా?
తమిళనాడులోని 24 జిల్లాలు మెట్టూరు డ్యామ్ నీటిపై ఆధారపడి ఉన్నాయి. దీంతో కావేరి నదీ జలాలపై తమిళనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ముందుగా బెంగళూరు ప్రజల కోసం తాగునీటిని కాపాడకుండా తమిళనాడులోని రైతుల వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి కావేరి నీటిని వదిలేశారని కర్ణాటక ప్రజలు ఆరోపించారు. ఇన్ని గందరగోళాల మధ్య ఆ సమయంలో మెట్టూరు డ్యాం నీటిమట్టం పడిపోవడంతో భయాందోళనలు నెలకొన్నాయి.

అయితే గత ఏడాది చివర్లో మెట్టూరు డ్యాం నీటిమట్టం ఊహించని విధంగా పెరిగి తమిళ రైతులు, అక్కడి ప్రజల్లో కొత్త అంచనాలను పెంచింది. ఇప్పుడు వేసవిలో ఇదే నీరే అక్కడి రైతులకు ఆధారం అయ్యింది. అయితే ఇప్పుడు బెంగళూరు ప్రజలు మాత్రం తాగునీరు లేక నానా తిప్పులు పడుతున్నారు. కర్ణాటకలో పుట్టిపెరిగి పోర్ల వలసిన కావేరి నీరు కర్ణాటక ప్రభుత్వం నిర్లక్షం కారణంగా తమిళనాడు పాలైయ్యిందని కన్నడిగులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications