మైనర్ ను గదిలో పెట్టి చితకబాదేశారు, బలవంతంగా అల్లా హు అక్బర్ నినాదాలు
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మైనర్ అబ్బాయిని గదిలో బంధించి కర్రలతో కొట్టి అల్లా హు అక్బర్ అని బలవంతంగా నినాదాలు చేయించారు. ఆయువకుడిని నిందితులు కాలుతో తన్ని ముఖంపై ఉమ్మివేసి అతని నాలుకను నలిపేసి ఆ మైనర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ అమానవీయ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ జిల్లా మోతీపురాలో చోటు చేసుకుంది.
వైరల్ అయిన వీడియోలో ఒక యువకుడు మైనర్‌ను కొట్టడం స్పష్టంగా కనిపించింది. బాలుడిపై దాడి చేసే క్రమంలో ఆ యువకుడు అల్లా హు అక్బర్ అని అరవాలని ఆదేశిస్తూనే ఉన్నాడు. దీనితో పాటు మియా సాహెబ్ జిందాబాద్ నినాదం చెప్పమని బాలుడిని ఒత్తిడి చేశాడు.

కర్రతో తీవ్రంగా కొట్టడంతో బాలుడి చేయి విరిగింది. తరువాత అతన్ని నవ్వమని చెప్పగా ఆ బాలుడు నిరాకరించడంతో అతను నిరంతరం ఆ బాలుడి మీద దాడి చేశాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముజఫురా జిల్లా మోతీపూర్ పరిధిలోని బత్రాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది.

ముందుజాగ్రత్త చర్యగా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.దాడికి గురైన మైనర్ బాలుడు, నిందితులు అయిన యువకుడు అంతకుముందు మంచి స్నేహితులు అని, అయితే ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఆ తర్వాత బాలుడిని చుట్టుముట్టి చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు బాధితులకు హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడాలని గ్రామస్తులను పోలీసులు కోరారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ గ్రామంలో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ఈ విషయంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications