New Parliament: ప్రతిపక్షాల నిర్ణయం బాధకరం.. వారు పార్లమెంటరీ విధానాలనే అవమానిస్తున్నారు..
మే 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని 19 ప్రతిపక్ష పార్టీల నిర్ణయించాయి. అయితే ఈ నిర్ణయాన్ని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) బుధవారం ఖండించింది.
"ఇది మన దేశ ప్రజాస్వామ్య నైతికత, రాజ్యాంగ విలువలకు కఠోరమైన అవమానం" అని NDA ప్రకటన విడుదల చేసింది. "గత తొమ్మిదేళ్లుగా ఈ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటరీ విధానాలను పదేపదే అవమానపరుస్తున్నాయి. సమావేశాలకు అంతరాయం కలిగించడం, కీలకమైన చట్టాల సమయంలో వాకౌట్‌లు చేయడం" వంటి చేస్తున్నాయని విమర్శించింది.

" ప్రతిపక్షాలు అప్పటి భారత రాష్ట్రపతి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక GST సమావేశాన్ని బహిష్కరించారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డు లభించినప్పుడు వేడుకకు హాజరు కాలేదు" అని బీజేపీ నేతలు గుర్తు చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం ఆమెను అవమానించడమే అని అన్నారు. "ప్రజల అభీష్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ప్రతిపక్షం పార్లమెంటుకు దూరంగా ఉండటం బాధాకరమైనది" అని పేర్కొంది.
మే 28 ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్, టిఎంసి, ఆప్ సహా 19 ప్రతిపక్షాలు బుధవారం నిర్ణయించాయి. బహిష్కరణకు గల కారణాలను వివరిస్తూ ప్రతిపక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దేశ అధ్యక్షురాలు ముర్మును పూర్తిగా పక్కనపెట్టి, కొత్త పార్లమెంటు భవనాన్ని తానే స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోడీ నిర్ణయం ఘోర అవమానంగా అభివర్ణించాయి. ఇది మన ప్రజాస్వామ్యంపై దాడి భావిస్తున్నామని తెలిపాయి.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), జనతాదళ్ (యునైటెడ్), ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (UBT), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), సమాజ్‌వాదీ ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశారు. పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్ (మణి), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, విడుతలై చిరుతైగల్ కట్చి, మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కజగం, రాష్ట్రీయ లోక్ దళ్ ఇందులో ఉన్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి నిరాకరించారు. కానీ ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మంగళవారం తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications