సీఎం ఖరారు వేళ బిగ్ ట్విస్ట్ - దక్కేదెవరికి..!!

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎన్నికల్లో అనూహ్యంగా భారీ విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు తొలుత ఈ నెల 26న ముహూర్తంగా నిర్ణయించారు. రేపు (సోమవారం) పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే, సీఎం పదవి కోసం పోటీ బీజేపీ నాయకత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రమాణ స్వీకారం పైన నిర్ణయం మారింది. ముఖ్యమంత్రి ఖరారు పై బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ కూటమి అధికారంలోకి రావటంతో మూడు పార్టీల నుంచి సీఎం పదవి కోసం ఒత్తిడి ఉంది. దీంతో, బీజేపీ అధినాయకత్వం దీని పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 లోగా మహారాష్ట్ర నూతన ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంది. దీంతో, ఈ నెల 26న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత భావించినా.. ఇప్పుడు నిర్ణయం మారినట్లు తెలుస్తోంది. రేపు (సోమవారం) కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ ముఖ్య నేతల సమాచారం. ముంబాయి లోని వాంఖడే స్టేడియంలో ప్రమాణ స్వీకారం నిర్వహించాలని నిర్ణయించారు.

The new Maharashtra chief minister and the deputy CM s oath-taking ceremony will likely take place on Nov 25

బీజేపీ హైకమాండ్ నిర్ణయం
రేపు (సోమవారం) మంచి రోజు కావటంతో సీఎంతోపాటు మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారని సీఎం శిండే కేబినెట్‌లోని సీనియర్ మంత్రి దీపక్ కేశర్‌కర్ వెల్లడించారు. బీజేపీ ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ - శివసేన అధికారంలో షేరింగ్ ఫార్ములా తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఫడ్నవీస్ సీఎం గా చేస్తారని..షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా కొనసాగుతారని చెబుతున్నారు. అయితే, బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించటంతో షిండే, అజిత్ పవార్ సైతం బీజేపీ ఢిల్లీ నాయకత్వం సూచనల మేరకు వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. షిండే, పవార్ తమ మద్దతు దారులతో సమావేశం ఏర్పాటు చేసారు.

ఫడ్నవీస్ కే ఛాన్స్
ఇదే సమయంలో ముందుగా ముఖ్యమంత్రి ఖరారు పై శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాల్సి ఉంది. 25న ఈ సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ రాత్రికి బీజేపీ ముఖ్య నాయకత్వం షిండే, అజిత్ పవార్ తో చర్చించి రేపటి ఎల్పీ సమావేశంలో సీఎం ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఎలాంటి వివాదాలు ఉండవని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. 132 సీట్లు గెలిచిన బీజేపీకే సీఎం పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ నాయకత్వం మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా వచ్చే ఒకటి రెండు రోజుల్లో బీజేపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+