లవ్ మ్యారేజ్, విందు భోజనం, సినిమా స్టైల్లో అక్క మొగుడిని వెంటాడి నరికి చంపిన బావమరిది !
బెంగళూరు/రామనగర: 7 ఏళ్ల నుంచి ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని వ్యతిరేకించారు. ప్రేమికులు గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికూతురు, పెళ్లికొడుక్కి బంధువులు వింధు బోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసి వెలుతున్న బావను అతని బావమరిది, ఫ్రెండ్స్ కలిసి సినిమా స్టైల్లో వెంటాడి వెంటాడి వేటకొడవళ్లతో నరికి చంపేశారు.
కర్ణాటకలోని రామనగర తాలుకాలోని కేజీ హోళి ప్రాంతంలో అశ్వథ్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అశ్వథ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సహనా అనే యువతి, అశ్వథ్ ప్రేమించుకున్నారు. 7 సంవత్సరాలు ప్రేమించుకున్న సహనా, అశ్వథ్ పెళ్లి చేసుకోవలని అనుకున్నారు.

సహనాకు భరత్ అనే సోదరుడు ఉన్నాడు. సహనా, అశ్వథ్ పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. నువ్వు అశ్వథ్ ను పెళ్లి చేసుకుంటే వాడిని నరికి చంపేస్తానని భరత్ అతని అక్క సహనాను హెచ్చరించాడు. అయితే అశ్వథ్, సహనా కుటుంబ సభ్యులను ఎదిరించి ఇటీవల ధర్మస్థలకు వెళ్లి స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
సహనా కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు చెన్నపట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసుల ముందు స్వయంగా హాజరైన సహనా తాను ఇష్టప్రకారం అశ్వథ్ ను పెళ్లి చేసుకున్నానని, తాను మేజర్ అని పోలీసులకు చెప్పింది. పోలీసులు అశ్వథ్, సహనా కుటుంబ సభ్యులకు రాజీ చేసి ఇక సైలెంట్ గా ఉండిపోవాలని ఇరు వర్గాలకు సూచించారు.

రామనగరలోని మోహన్ ఫామ్ హౌస్ లో అశ్వథ్ బంధువులు నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత అశ్వథ్ కుటుంబ సభ్యులు కలిసిపోయారు. రామనగరలోని ఫామ్ హౌస్ లో కొత్త జంట అశ్వథ్, సహనా దంపతులకు మాంసాహార వింధు భోజనం ఏర్పాటు చేశారు. అశ్వథ్, సహనా దంపతులతో పాటు అతని తల్లిదండ్రులు, బంధువులు వింధు భోజనానికి హాజరైనారు.
మద్యాహ్నం భోజనం చేసిన అశ్వథ్, సహనా ఒక బైక్ లో, అశ్వథ్ తల్లిదండ్రులు మరో బైక్ లో మోహన్ ఫామ్ హౌస్ లో నుంచి ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో కోట్టూరు- కేజీ హోసహళ్లి మార్గంలో భరత్, అతని స్నేహితులు బైక్ లో అశ్వథ్, సహనాలను వెంబడించారు. మార్గం మధ్యలో భరత్ అతని అక్క సహనా భర్త అశ్వథ్ ను వేటకొడవలితో నరికాడు.

బైక్ కిందపడిపోవడంతో అశ్వథ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే భరత్, అతని స్నేహితులు వెంటాడి వెంటాడి వేటకొడవళ్లు కత్తులతో అశ్వథ్ మీద దాడి చేశారు. అడ్డుపడిన సహనా మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన కొత్త పెళ్లికొడుకు అశ్వథ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లవ్ మ్యారేజ్ ను వ్యతిరేకించిన భరత్ అతని అక్క సహనా భర్త అశ్వథ్ ను వెంటాడి వెంటాడి నరికి చంపేయడం రామనగర జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications