యువ‌తిపై అత్యంత పాశ‌వికంగా ప్ర‌వ‌ర్తించిన య‌జ‌మాని.. జుట్టుప‌ట్టి ఈడ్చుకెళ్లి..

మ‌నుషుల్లో రోజురోజుకు మాన‌వ‌త్వం న‌శించిపోతుంది. చుట్టుప‌క్క‌లా ప‌రిస‌రాల్లో దారుణాలు జ‌రుగుతున్నా ఏ ఒక్క‌రూ ఆప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం లేదు స‌రిక‌దా, క‌ళ్లప్ప‌గించి చూస్తు ఉండిపోతున్నారు. రాను రాను ఆరాచ‌కాలు ఎక్కువ‌యిపోతున్నాయి. మొన్నామ‌ధ్య‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌, ఇంకా ఇలాంటివే దేశంలో ప్ర‌తినిత్యం జ‌రుగుతూనే ఉన్నాయి. నేడు ఆహ్మ‌దాబాద్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ స్పా యజమాని నడిరోడ్డు మీద ఓ యువతి పట్ల అత్యంత దారుణంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా, ఆ యువతి జుట్టు పట్టుకొని లాగుతూ, బట్టలు చింపుతో, చెంపల మీద కొడుతూ.. వేధింపులకు గురిచేశాడు. అయినా చుట్టుప‌క్క‌లా ఉన్న‌వారు ఏమ‌ని ప్ర‌శ్నించ‌లేదు. సినిమా చూసిన‌ట్లు నిల‌బ‌డి చూసున్నారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంలోకి వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌న్నీ సీసీటివీ ఫుటేజీలో రికార్డ‌య్యాయి.

ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వివరాలను ఒక‌సారి చూద్దాం. అహ్మదాబాద్ లోని గెలాక్సీ యజమాని మొహ్సిన్. ఆయనకు బిజినెస్ పార్టనర్ గా ఓ ఇర‌వైనాలుగేళ్ల యువతి ఉంది. స్పా ముందే ఆ యువతిపై దాడికి తెగబడ్డాడు స్పా యజ‌మాని. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై రాత్రిపూట ఆ యువ‌తిపై య‌జ‌మాని మొహ్సిన్ ప‌దే ప‌దే దాడి చేయ‌డం మ‌న‌కు వీడియోలో స్పష్టంగా క‌నిపిస్తోంది. య‌జ‌మాని దాడి చేస్తుంటే ఆ యువ‌తి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ఆమె ప్ర‌య‌త్నం వృధా అయ్యింది. వెంట ప‌డుతూ మ‌రీ ఆమె దుస్తులు చింపేందుకు ప్ర‌య‌త్నించాడు ఆ య‌జ‌మాని. అత‌ని వింత ప్ర‌వర్త‌నా, వికృత చేష్ట‌ల‌నుంచి త‌ప్పించుకోవాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా కూడా ఆ య‌జ‌మాని కండ‌బ‌లం, ప‌శుబ‌లం ముందు సాధ్య‌ప‌డ‌లేదు.

owner who behaved most cruelly towards the young woman

అంత‌టితో ఆగ‌లేదు. ఆ యువ‌తిపై దాడి చేస్తూనే ఉన్నాడు. చెంప‌ల‌పై కొట్ట‌డం. జుట్టుప‌ట్టుకుని ఈడ్చుకూ రావ‌డం. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఈ వికృత చేష్ట‌లు కొన‌సాగాయి. ఈ ఘ‌ట‌న చాలా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇది సెప్టెంబ‌ర్ 25న జ‌రిగింది.

ఈ సంఘ‌ట‌న స‌మయంలో అక్క‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా ఉన్న‌ట్లు సీసీటీవే ఫుటేజ్‌లో మ‌న‌కు క‌నిపిస్తుంది. కానీ, వారు అత‌నికి మద్ద‌తిచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇదంతా చూసిన ఓ సామాజిక కార్యకర్త బోడక్ దేవ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని రక్షించారు. పోలీసులు వచ్చేటప్పటికి నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసుల విచారణలోనే అతనితో దెబ్బలు తిన్న యువతి స్పా బిజినెస్ లో భాగస్వామి అని తేలింది. బిజినెస్ విషయంలోనే భాగస్వాములైన ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని అది హింసాత్మకంగా మారిందని పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన జరిగిన తర్వాత రెండు రోజుల వరకు యువతి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు కానీ సెప్టెంబర్ 27వ తేదీన దీనిమీద పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారనేది స‌మాచారం. దర్యాప్తు ప్ర‌క్రియ ప్రారంభించారు. యువతి మీద అత్యంత పాశవికంగా దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీలో రికార్డయిన ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో చూసిన నెటిజన్లు నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణమేదైనా సరే మహిళ మీద అంత దారుణంగా దాడి చేయడం కరెక్ట్ కాదని ఆ య‌జమానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+