సెంట్రల్ జైలులో హీరో దర్శన్ కు ఫోన్ ఇచ్చింది ఇతనే

బెంగళూరు పరప్ప అగ్రహార సెంట్రల్‌ జైలులో నటుడు దర్శన్‌కు తెలిసిన రౌడీకి మొబైల్‌ ఫోన్‌ తీసుకొచ్చిన ట్రావెల్‌ ఏజెన్సీ యజమానిని ఎలక్ట్రానిక్‌ సిటీ ​​పోలీసులు విచారించారు. బనసవాడి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని మణివణ్ణన్‌ అలియాస్ మణిపై ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. బెంగళూరులోని

పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో రౌడీ ధర్మను విచారించగా మణి విషయం బయటకు వచ్చింది.

అనంతరం మణి మొబైల్‌ కాల్స్‌ను పరిశీలించగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు అక్రమంగా మొబైల్‌ ఫోన్ సరఫరా అవుతున్న విషయం తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో రౌడీ ధర్మ మొబైల్ ఫోన్‌లో నటుడు దర్శన్ వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడిన వీడియో క్లిప్ బయపడింది. .

The police caught the person who gave the mobile phone to Hero Darshan in Central Jail
జైల్లో దర్శన్ కు లగ్జరీ లైఫ్ కల్పించిన కేసును విచారిస్తున్న పోలీసులకు మొబైల్ ఫోన్ పరిశీలించగా మణి అనే వ్యక్తి మ్యాటర్ బయటకు వచ్చింది.

బెంగళూరులోని బసనవాడిలో ట్రావెల్స్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న మణికి రౌడీ ధర్మతో చాలా ఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఈ స్నేహంతో తన ఏజెన్సీ కార్మికుడు యాదవ్ పేరిట మొబైల్ ఫోన్ కొని దానిని దుస్తుల్లో దాచి సెంట్రల్ జైలులో ఇచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

మెజెస్టిక్ దగ్గర ఈ మొబైల్ కొన్నాడు. ఈ మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు దాని ఫొటోను వాట్సాప్‌లో ధర్మకి పంపాడు. ఆ తర్వాత తనకు నచ్చిన సామ్‌సంగ్ మొబైల్‌ని కొనుగోలు చేసిన మణి జైలుకు తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

హత్యకేసులో బళ్లారి సెంట్రల్ జైలులో వెన్నునొప్పితో బాధపడుతున్న కన్నడ నటుడు దర్శన్‌కు వైద్య చికిత్సలు చెయ్యడానికి బిమ్స్‌లో శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయా లేదా అనే నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారని తెలిసింది. దర్శన్‌కు తీవ్రమైన వెన్నునొప్పి నేపథ్యంలో బిమ్స్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేశారు. అనంతరం డాక్టర్ ఇచ్చిన రిపోర్టులో దర్శన్ కు శస్త్ర చికిత్స అవసరమని చెప్పారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+