పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు, ముగ్గురికి ముహుర్తం, హోం మంత్రి ఆశ్చర్యం ?

పాకిస్తాన్ కు అనుకూలంగా బెంగళూరులోని విధానసౌధలో నినాదాలు చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు అనే విషయంపై కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర్ స్పందించారు. దీనిపై మీడియాప్రశ్నించగా ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. అవునా, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని అరెస్టు చేశారా అని హొం మంత్రి పరమేశ్వర్ మళ్లీ మీడియానే ప్రశ్నించారు.

దీని గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని, నేను ఉదయం నుండి తుమకూరు ప్రజలతోనే ఉన్నానని, కేసు విచారణ చేస్తున్న అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, విచారణలో భాగంగా నిందితులను అరెస్టు చేసి ఉండవచ్చు అని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. ముగ్గురు నిందితుల అరెస్టుపై పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ పై హొం మంత్రి పరమేశ్వర్ వ్యాఖ్యానిస్తూ ఇది అధికారికం అని ఎలా నమ్ముతారు? నేను ఇలాంటి ప్రకటనను నమ్మను అని అన్నారు.

The police have arrested three people in a case of raising pro-Pakistan slogans in Vidhansauda

ముగ్గురు అరెస్టు అయ్యారనే విషయం నేను నిజంగా నమ్మలేకపోతున్నాను అని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే నిర్ధారించి మీడియాకు తెలియజేస్తామని, నేను ఇప్పుడు తుమకూరు నుంచి బెంగుళూరు వెలుతున్నానని, ఆ తర్వాత అరెస్టు విషయంపై నిర్ధారించుకుంటానని, తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి సమాచారం చెబుతానని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులో పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారని నిర్ధారణ కావడంతో బెంగళూరులోని విధానసౌధ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు సోమవారం మీడియాకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. హావేరీ జిల్లా బ్యాడగికి చెందిన మహ్మద్ నశిపుడి, బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన మున్వర్, ఢిల్లీకి చెందిన ఇల్తాజ్ అనే నిందితులను అధికారులు అరెస్టు చేసి విచారణ ముమ్మరం చేశారు.

విధానసభలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసుకు సంబంధించి ప్రైవేట్ నివేదిక అందడంతో మేల్కొన్న సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఆందోళన చెయ్యడంతో తరువాత ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారని రుజువు అయ్యిందని, ఆ తర్వాతే ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారని వెలుగు చూసింది.

The police have arrested three people in a case of raising pro-Pakistan slogans in Vidhansauda

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికను ప్రభుత్వం ఇంకా బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, సిద్దరామయ్య ప్రభుత్వం ఏదీ దాచిపెట్టి, ఎవరినో ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నదని, నివేదికను బహిర్గతం చేయడంలో కాంగ్రెస్ నాయకులు ఎందుకు వెనుకాడుతున్నారని కర్ణాటక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తం మీద విధాన సౌధలో పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+